NTV Telugu Site icon

Konda Surekha: వరంగల్ మార్కెట్ లో ఓ మాఫియా దందా చేస్తోంది.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

Konda Surekha

Konda Surekha

Konda Surekha: వరంగల్ మార్కెట్ లో ఓ మాఫియా దందా చేస్తోందని మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు వరంగల్ లక్ష్మీపురం లోని కూరగాయల మార్కెట్ ను సందర్శించి మార్కెట్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ లో అనేక అవకతవకలు జరిగాయని తెలిపారు. గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనర్హులకు మార్కెట్ లో షాపులను కేటాయించారని తెలిపారు. కూరగాయల మార్కెట్ లో ఓ మాఫియా దందా చేస్తోందన్నారు. అనర్హులను గుర్తించి తిరిగి షాపులను స్వాధీనం చేసుకుంటామన్నారు. చిరు వ్యాపారులను గుర్తించాలన్నారు. లైసెన్స్ ఇచ్చి మార్కెట్ లో చోటు కల్పించాలన్నారు. గత సెక్రటరీ కేటాయించిన దుకాణాల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ లో పార్కింగ్ తో పాటు మౌళిక సదుపాయలు కల్పిస్తామన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించడంతో పాటు కూరగాయల మార్కెట్ సమీపంలో వర్మీ కంపోస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Read also: Komati Reddy Counter: కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటి రెడ్డి గట్టి కౌంటర్

అందరికి లాభం జరిగే విధంగా అర్హులకు షాపులను ప్లాట్స్ కేటాయిస్తామన్నారు. మార్కెట్ లో భారీ షెడ్ తో పాటు, సీసీ రోడ్ మురుగు కాలువలను నిర్మిస్తామని తెలిపారు. అద్దెల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామన్నారు. డ్రా పద్ధతిలో దుకిణాలను.. కూరగాయల విక్రయాలు ప్లాట్ లను కేటాయిస్తారని అన్నారు. కూరగాయల మార్కెట్ లోనే పూల దుకాణాలకు చోటు కల్పిస్తామన్నారు. త్వరలోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామన్నారు. మార్కెట్ లోని దుకాణాల పై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను ఇవ్వాలని సెక్రటరీని, కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. నూతనంగా కేటాయించే దుకాణాలకు కమిటి ఇవ్వాలన్నారు. మార్కెట్ లో ప్లాస్టిక్ ను నిషేధించాలి.. బాటిల్ వెండర్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో మార్కెట్ లో ఆలయంను నిర్మిస్తామని తెలిపారు. మార్కెట్ ను శుభ్రంగా ఉంచాలన్నారు. కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు ప్లాస్టిక్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం ఐతే నోటీసులు ఇచ్చి మార్పు రాకపోతే లైసెన్స్ తొలగించాలన్నారు. మార్కెట్ లో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
TFCC : ఘనంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

Show comments