NTV Telugu Site icon

Warangal: నేడు వరంగల్ లో రైతు భరోసాపై సదస్సు.. పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి..

Warangal Raitu Bharosa

Warangal Raitu Bharosa

Warangal: నేడు వరంగల్ జిల్లాలో రైతు భరోసాపై సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించనున్నారు. హైదారాబాద్ నుండి హెలికాప్టర్ లో వరంగల్ కు బయలుదేరనున్నారు. భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం స్థానిక ఎమ్మెల్యేతో భద్రకాళి అమ్మవారి గుడి మాడవీధుల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం హన్మకొండ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన రైతు భరోసా సదస్సుకు హాజరుకానున్నారు. రైతు భరోసా పథక విధివిధానాలపై నేడు హనుమకొండ కలెక్టరేట్ లో రైతు భరోసా పథకంపై సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో పూర్తి చేశారు. రైతు భరోసా పథకంపై వివిధవర్గాల నుంచి వస్తున్న అభిప్రాయాలను సేకరించి.. రైతు బంధు ఎవరికి ఇవ్వాలనే ఆలోచనతో ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారు.

Read also: Mount Everest: స్వర్గలోకం ఇదే కాబోలు.. మౌంట్ ఎవరెస్ట్‌ అందాలు అదరహో.. (వీడియో)

ఈ మంత్రి వర్గ సంఘ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బా బుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్శాఖ మంత్రి సీతక్క సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో రైతుభరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతరవర్గాల నుంచి మంత్రి వర్గ ఉప సంఘం అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి సమర్పించనుంది. రైతు భరోసా సదస్సుకు ఉమ్మడి వరంగల్ నుంచి 250 మంది రైతులను ఆహ్వానించారు. ఈ రైతులతో రైతు బంధు పథకం ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే దానిపై చర్చించనున్నారు.
KCR Petition: నేడు సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ.. సర్వత్రా ఆసక్తి

Show comments