NTV Telugu Site icon

Wall Posters Against BJP: ఖబడ్దార్‌ బీజేపీ.. మునుగోడులో మీకు గోరీ కడతాం

Munugode By Poll

Munugode By Poll

Wall Posters Against BJP: మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం జోరుమీదుంది. ప్రచారంలో నాయకులు ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సంధింస్తున్నారు. మొన్నటి వరకు రాజగోపాల్‌ రెడ్డిపై వెలసిన పోస్టర్లు కలకలం రేపగా.. నిన్న ప్రతిపాదిత ఫ్లోరైడ్ రీసర్చ్ సెంటర్ వద్ద బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు సమాధి కట్టి వినూత్న నిరసనకు దిగారు గుర్తుతెలియని వ్యక్తులు. నేడు మళ్లీ బీజేపీపై పోస్టర్లు వెలశాయి. ఖబడ్దార్ బీజేపీ.. మునుగోడులో మీకు కడతాం గోరీ అంటూ లంబాడి హ్కుల పోరాట సమితి హెచ్చరిస్తున్న పోస్టర్లను నిన్న అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఢిల్లీలో బీజేపీ కుట్రలు చేస్తుందని బీజేపీకి వ్యతిరేకంగా చండూరులో మున్సిపాలిటీలో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌ రెడ్డి ద్వారా లంబాడీల ఓట్లను కొనాలని ఆపార్టీ నాయకులు దుష్ట రాజకీయాలు చేస్తుందని విమర్శించింది. లంబాడీలు అమ్ముడు పోయే వాళ్లం కాదని, బానిసలం అంతకన్నా కాదని.. మేం లంబాడి బిడ్డలం అంటూ ఆపోస్టర్లో వుంది. అయితే.. లంబాడి హక్కుల పోరాట సమితి పేరుతో మున్సిపాలటీలో వెలసిన ఈ పోస్టర్లు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా మారాయి.

Read also: School Bus Accident: ప్రమాదంలో స్కూల్‌ బస్సు నుజ్జునుజ్జు.. తృటిలో తప్పించుకున్న 20 మంది విద్యార్థులు

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోట్ల నిధులు మంజూరు చేసింది అని బిజెపి నేతలు ప్రచారంలో పేర్కొంటున్న నేపథ్యంలో తాజాగా.. ప్రతిపాదిత ఫ్లోరైడ్ రీసర్చ్ సెంటర్ వద్ద బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు సమాధి కట్టి వినూత్న నిరసనకు దిగారు గుర్తుతెలియని వ్యక్తులు. కేంద్ర ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రక్తసిని రూపుమాపడానికి ఫ్లోరైడ్ రీసెర్చ్ మంజూరు చేసిదని. కానీ దశాబ్దాలు గడుస్తున్న నిధులు విడుదల కాలేదని, రీసెర్చ్ సెంటర్ మనగడలోకి రాకపోవడం.. కార్యకలాపాలు అసలు ప్రారంభమే కాకపోవడంపై నిరసన వ్యక్తం అవుతుంది.
Made in Hyderabad Guns: హైదరాబాద్‌లో తుపాకుల తయారీ