మునుగోడు ఉప ఎన్నిక వేళ ప్రలోభాల పర్వం ఊపందుకుంది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సందడే సందడి. రాజకీయ పార్టీలు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఇదిలా వుంటే.. మునుగోడులాగే ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని, అలా చేస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఓటర్లు ఎమ్మెల్యేల మీద వత్తిడి తెస్తున్నారు. నిన్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇవాళ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఫోన్లమీద ఫోన్లు వస్తున్నాయి. మెదక్ జిల్లాలోని ఎమ్మెల్యేలకు రాజీనామా చేయాలని వరుస ఫోన్లు రావడం హాట్ టాపిక్ అవుతోంది.
Read ALso: Azam Khan: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజంఖాన్‌కు షాక్.. శాసనసభ్యత్వం రద్దు
నిన్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి రాజీనామా చేయాలని ఫోన్ చేశాడు మెదక్ నియోజకవర్గ వాసి. ఈ రోజు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కూడా రాజీనామా చేయాలని ఫోన్ చేశాడో యువకుడు. మీరు రాజీనామా చేస్తే మన నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పాడా యువకుడు. అయితే ఆ యువకుడికి ఘాటైన బదులిచ్చారు మదన్ రెడ్డి. నేనెందుకు రాజీనామా చేస్తా నాకు తీట పడ్డదా అని చెప్పారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రాజీనామా కాల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ స్వయంగా ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడో వ్యక్తి. మీరు కూడా రాజీనామా చేస్తే మునుగోడు లాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పాడు. మంచిది అంటూ వెంటనే కాల్ కట్ చేశారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డ. ఈ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మరోవైపు… మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విష్ణువర్థన్ రెడ్డి ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన వ్యక్తిని బెదిరించినట్టు తెలుస్తోంది. నిన్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఫోన్ చేసి రాజీనామా చేయాలని అడిగాడు టెక్రియాల్ గ్రామ వాసి స్వామి. మేడం మీరు రాజీనామా చేస్తే మన మెదక్ నియోజకవర్గం మునుగోడు లాగా అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. మంచిది అంటూ వెంటనే కాల్ కట్ చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.. ఈ విషయం అందరి నోట పడింది.
ఈ రోజు స్వామికి కాల్ చేసిన ఎమ్మెల్యే PA విష్ణువర్ధన్ రెడ్డి బెదిరించాడు. ఎమ్మెల్యేతో మాట్లాడి అది రికార్డ్ చేసి వాట్సాప్ గ్రూప్ లో ఎందుకు పెట్టావు అని అతడిని బెదిరించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ రాజీనామాల గోల ఇప్పుడు సంగారెడ్డిలో వైరల్ అవుతోంది.నిజానికి మెదక్ ఎమ్మెల్యే పీఏ పేరు రాజశేఖర్.. తనపేరు విష్ణువర్థన్ రెడ్డి అని చెప్పి పేరు మార్చి బెదిరింపులకు పాల్పడ్డాడు రాజశేఖర్.. తన పేరు విష్ణు వర్ధన్ రెడ్డిగా చెప్పిన రాజశేఖర్ వ్యవహారం కలకలం రేపుతోంది.
Read Also: Manish Sisodia: తెలంగాణలో “ఆపరేషన్ లోటస్” బట్టబయలైంది.