NTV Telugu Site icon

Viral Fevers: వాతావరణంలో మార్పు.. పిల్లలపై విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్

Firal Fiver

Firal Fiver

Viral Fevers: ఫ్లూ వ్యాధులు టెన్షన్‌ను కలిగిస్తున్నాయి. వైరల్ ఫీవర్ బారిన పడి చిన్నారులు విలవిల లాడుతున్నారు. ముఖ్యంగా పసిపిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలతో పాటు ఈ వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. గత రెండు వారాలుగా జ్వర లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పీడియాట్రిక్ వైద్యులు పేర్కొంటున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పుల కారణంగా ఫ్లూ వైరస్ చురుగ్గా, విజృంభిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే వందలాది మంది చిన్నారులు ఈ వైరస్ బారిన పడ్డారని వైద్యులు పేర్కొంటున్నారు. బాధిత పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్నాయని చెప్పారు.

Read also: Sukesh Chandrasekhar: తీహార్ జైలులో సుఖేష్ చంద్రశేఖర్‌కు ఎయిర్ కూలర్.. కోర్టు ఆదేశం

అయితే..గత రెండేళ్లతో పోలిస్తే హనుమకొండ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్ ప్రభావం చిన్నారులపై కనిపిస్తోంది. చిన్నారులు డెంగ్యూ, టైఫాయిడ్‌తో బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో బెడ్లు పిల్లలతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఆస్పత్రికి వస్తున్న పది మంది చిన్నారుల్లో ఆరుగురు ఈ వైరస్ బారిన పడుతున్నట్లు బాలల వైద్య నిపుణులు చెబుతున్నారు.

Read also: Kalki 2898 AD First Review: కల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..టాక్ ఎలా ఉందంటే?

సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కనిపించే ఫ్లూ కేసులు ఈ ఏడాది ముందుగానే వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్న ఫ్లూ కనీసం పదిరోజులపాటు పిల్లలకు సోకుతుందని సూచిస్తున్నారు. దగ్గు, జలుబు తీవ్రత ఎక్కువగా ఉండడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రులకు వస్తున్న పది మందిలో ఆరుగురు ఫ్లూ వైరస్ తో బాధపడుతుండగా, మరో ఇద్దరు డయేరియా తదితర సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉదయం పూట విపరీతమైన ఎండలు, మధ్యాహ్నం నుంచి చల్లటి వాతావరణం, తేమతో కూడిన గాలులు, వర్షాలు కురుస్తుండటంతో వైరస్ చురుగ్గా మారిందని చెబుతున్నారు. ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వారు నివసించే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

Read also: Astrology: జూన్ 19, బుధవారం దినఫలాలు

వేడి ఆహారం, గోరువెచ్చని నీళ్లతో చేతులు కడుక్కోవాలి. వర్షంలో తడవకండి. స్కూల్ నుంచి వచ్చాక బట్టలు, షూ, సాక్స్ విప్పేసి స్నానం చేయాలి. వాతావరణం చల్లగా ఉంటే, టవల్‌ను వేడి నీటిలో ముంచి ఆరబెట్టండి. చేతులు, కాళ్లు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి. అనారోగ్య పెద్దలలో నివారించండి. చేతి రుమాలు, ఇతరులు ఉపయోగించే వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాలి. కానీ చిన్నారులు జ్వరంతో ఇబ్బందులు పడుతుంటే.. ఇదేం సమస్య అని భావించి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తోంది. దీంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలకు వేలల్లో వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. దీనిపై వైద్యశాఖ స్పందించాలన్నారు.
Rakshith Shetty : ఓటీటీ సంస్థల పై హీరో సంచలన వ్యాఖ్యలు..