Site icon NTV Telugu

యాసంగి వడ్లు కొంటామని లిఖితపూర్వకంగా ఇవ్వాలి : వినోద్ కుమార్‌

పీయుష్ గోయల్ వ్యాఖ్యలు రైతులను గందరగోళంలోకి నెట్టాయని… యాసంగి వడ్లు కొంటామని లిఖితపూర్వకంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమైనా మాట్లాడారా? అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చేందుకు క్లియరెన్స్ అయిందని పేర్కొన్నారు.

https://ntvtelugu.com/myanmar-jade-mine-landslide/

నలుగురు బిజెపి ఎంపిలు ఏం చేస్తున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు అయినా జాతీయ హోదా ఇప్పించారా? అని నిల‌దీశారు. కేసీఆర్ ను ఎలా గద్దె దింపాలని మాట్లాడటానికి ఢిల్లీ వెళ్ళారా అని ప్ర‌శ్నించారు. ఏపీలో పోలవరానికి 40 వేల కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్రం తెలంగాణ ప్రాజెక్ట్ లకు ఎందుకు ఇవ్వరని.. ప్ర‌శ్నించారు. బిజెపికి అధికారకాంక్ష తప్ప తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని.. సీఎం కేసీఆర్ వరి వేయద్దంటే బండి సంజయ్ వరి వేయాలని అంటాడని రెచ్చి పోయారు.

Exit mobile version