NTV Telugu Site icon

Patnam Narender Reddy: పోలీసు కస్టడీకి పట్నం నరేందర్‌రెడ్డి..

Patanam Narender Reddy

Patanam Narender Reddy

Patnam Narender Reddy: కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. లగచర్ల దాడి కేసులో ఏ-1గా ఉన్న నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నిందితుడిని రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ నరేందర్‌ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్‌ కు పోలీసులు తరలించనున్నారు. రెండు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఇవాళ, రేపు (శని, ఆదివారా)ల్లో న్యాయవాదుల సమక్షంలో విచారణకు అనుమతి ఇచ్చారు. అయితే.. పట్నం నరేందర్‌రెడ్డి ఇప్పటికే అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
Yadadri Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు స్పాట్ డెడ్..