Site icon NTV Telugu

Boat Capsized : వికారాబాద్‌లో బోటు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి, ఒకరి పరిస్థితి విషమం

Boat

Boat

Boat Capsized : వికారాబాద్ జిల్లాలోని సర్పన్‌పల్లి ప్రాజెక్ట్‌ వద్ద వీకెండ్ విహారయాత్ర విషాదంగా మారింది. బోటు ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరొకరిని తీవ్రమైన గాయాలతో ఆస్పత్రిలో చేర్పించారు. బీహార్‌కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసముంటున్న బంధువులను కలుసుకునేందుకు వచ్చారు. వారితో పాటు మరో మూడు కుటుంబాలు కలిసి వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఉన్న వెల్డర్ నేస్ రిసార్ట్‌కి విహారయాత్రకు వెళ్లారు.

Today Astrology: ఆదివారం దినఫలాలు.. ఆ పనులకు దూరంగా ఉండండి?

సాయంత్రం సమయంలో రిసార్ట్ నిర్వాహకులు బోటింగ్‌కి తీసుకెళ్లగా, తిరుగు ప్రయాణంలో వర్షం ప్రారంభమైంది. అప్రమత్తం కాకుండా హడావుడిగా తిరిగే సమయంలో బోటు తొండం విరిగిపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగింది. ఈ ప్రమాదంలో రీతికా, పూనమ్ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చింతాజనక విషయం ఏమిటంటే, ఈ రిసార్ట్‌కు బోటింగ్ నిర్వహించేందుకు అధికారిక అనుమతులు లేవన్న విషయం వెలుగు చూసింది. గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

CM Chandrababu: క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ

Exit mobile version