డబ్బులు సంపాదించడం, భవిష్యత్తు కోసం దాచుకోవడం, సరైన చోట పెట్టుబడి పెట్టడం అనేది చాలా తెలివైన ప్రయత్నం.మీరు దాచుకున్న డబ్బుతో స్థిరాస్తిని కొనుగోలు చేస్తే, అది చాలా సురక్షితమైన పెట్టుబడి అవుతుంది.హైదరాబాద్లో స్థిరాస్తిని ఎక్కడ కొనుగోలు చేయాలి అనేదే చాలామందికి అర్థం కావటంలేదు. మీరు కూడా ఇలాంటి సందిగ్ధంలో ఉంటే, మీ సందిగ్ధానికి సరైన సమాధానం విజయవాడ- హైదరాబాద్లోను కలిపే సువిశాలమైన నేషనల్ హైవే. ఈ కారిడార్ అంచెలంచెలుగా అభివృద్ది చెందుతున్నది.హైదరాబాద్ తూర్పు వైపున అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలే దీనికి నిదర్శనం.
Read Also: TRS MLAs Purchase Case: ఎమ్మెల్యేలకు ఎర కేసు నోటీసుల్లో గందరగోళం..
విజయవాడ కారిడార్ ఎల్బీ నగర్ నుండి ప్రారంభమై హయత్ నగర్, చౌటుప్పల్ మరియు సూర్యాపేట మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని కలుపుతుంది. కేంద్రప్రభుత్వం విజయవాడ హైవేని ఆరు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆరు లేన్ల హైవేకు చేరువలో ఉండటం అంటే, మీ స్థిరాస్తి అన్ని విధాలా అభివృద్ధికి నోచుకున్నట్లే, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక పథకాలను రచించి అమలు పరుస్తున్నది. దండు మల్కాపూర్ వద్ద ఉన్న MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడుచున్నది. అనేక కంపెనీలు ఇప్పటికే తమతమ స్థలాలను అభివృద్ధి చేయటం మొదలు పెట్టాయి.
ఈ ఏరియాలో మానవవనరుల నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని 2022 సంవత్సరాంతంలో ప్రారంభించారు మంత్రి కె.తారక రామారావు. త్వరలో ప్రారంభించనున్న తెలంగాణ ప్రభుత్వ గ్రోత్ ఇన్ డిస్పర్సన్ (GRID) విధానం ద్వారా ఈ ప్రాంతమంతా ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చెందబోతుంది. తత్ఫలితంగా ఇక్కడ వేలాదిమందికి కొత్త ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి. కంపెనీలు క్యాంపస్ లను ఈ ప్రాంతంలో నెలకొల్పేందుకు సన్నద్ధమౌతున్నాయి.
ఇప్పుడు ఎల్బీ నగర్ ప్రాంతం హైటెక్ సిటీ కోకాపేట్ కారిడార్ తో పోటీ పడుతున్నది. ఈ ప్రాంతంలో పెట్టే పెట్టుబడులపై వచ్చే రాబడి అత్యంత ఆకర్షణీయంగా మారనుంది. ఈ ప్రాంతం నగరంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతున్నది. విజయవాడ హైవేకి చేరువలో తమ కలల సౌధాన్ని నిర్మించుకోవాలనే వారికి ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా వుంటుంది. అన్ని సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటుచేయబోతున్నాయి. దీంతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటుచేసుకోవడానికి అనువైన ప్రాంతం కాబోతుంది.
Read Also:Tollywood: ముదురుతున్న ‘వారసుడు’ వివాదం.. రిలీజ్ వాయిదా పడుతుందా?
