Vijayashanti Says There Is No Safety For Women In BRS Government: బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ మహిళ నేత విజయశాంతి తాజాగా నిప్పులు చెరిగారు. వనస్థలిపురంలో మహిళ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఆమె.. మహిళకు మెతక వైఖరి పనికిరాదని, హార్డ్‌గా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళకు రక్షణ లేదని ఆరోపించారు. డ్వాక్రా మహిళల జీవితాల్ని చీకట్లో నెట్టారన్నారు. పామ్‌హౌస్‌లో పడుకునే సీఎం నెలకు రూ.4 లక్షలు తీసుకుంటాడు కానీ.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడని ఆరోపణలు చేశారు. గిరిజన పోడు భూములను లాక్కొని, వారిని జైల్లో పెట్టారన్నారు. అధికార పార్టీ మహిళ సర్పంచ్ పట్ల ఓ ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడితే.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
Bandi Sanjay: నేరస్తుల్ని కాపాడేందుకు సిట్.. కేటీఆర్ రాజీనామా చేయాలి
ఎమ్మెల్సీ కవితను ‘లిక్కర్ డాన్’గా పేర్కొన్నారు. ఈడీ, సీబీఐలు పిలిస్తే కవిత వెల్లడం లేదని.. తప్పు చేసి కూడా మహిళ అని తప్పించుకుందామని చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబం మొత్తం క్రిమినల్ మైండ్ ఉన్న నాయకులేనని, ఆ కుటుంబంలో మొదటి వికెట్ కవిత నుండే ప్రారంభమైందని అన్నారు. ఈ రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు సైతం మహిళల్ని వేధిస్తున్నారని.. ఏనాడైనా మహిళలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేను సీఎం కేసీఆర్ సస్పెండ్ చేశారా అని విజయశాంతి ప్రశ్నించారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా.. కేసీఆర్ చలనం లేకుండా ఉంటున్నారని.. అవసరానికి మాత్రమే పని చేయించుకొని, ఆ తర్వాత అవతలికి పొమ్మంటున్నారని అన్నారు. మహిళలు స్వతంత్రంగా బతికే స్వేచ్ఛను ఇచ్చే విధంగా సీఎం విధానాలు లేవన్నారు.
Australia Couple Lottery: అదృష్టమంటే ఇది.. భార్య అలిగింది, 16 కోట్ల లాటరీ తగిలింది
అంతకుముందు.. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్‌పై విజయశాంతి మాట్లాడుతూ, ఉద్యోగార్థిగా ఉండటమంటే జీవితాన్ని బలిపెట్టడమే అనే స్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను దిగజార్చిందని విమర్శించారు. తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటకొస్తున్నాయన్నారు. ఎంతో భ్రదత, సీక్రెసీతో ప్రశ్నాపత్రాల సిస్టమ్స్ ఉండాలని.. కానీ, వాటికి సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ చాలా సులువుగా నిందితులకి లభించడం.. వారు ఆ పేపర్స్‌ని చాక్లెట్లు, బిస్కెట్లు అమ్ముకున్నంత తేలిగ్గా అమ్ముకోవడం చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం, వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థమవుతోందని పేర్కొన్నారు.