Site icon NTV Telugu

Vijayashanti: రెండు రాష్ట్రాల ప్రజలు.. బీఆర్ఎస్‌కు కర్రుకాల్చి వాత పెడతారు

Vijayashanti Fires On Brs

Vijayashanti Fires On Brs

Vijayashanti Controversial Comments On KCR And BRS Party: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు ట్విటర్ మాధ్యమంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ రూపంలో ఏపీలో బీజేపీకి దెబ్బతీసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టే.. ఏపీ ప్రజల్ని నమ్మింగలుగుతానని కేసీఆర్ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణని అప్పులపాలు చేసిన కేసీఆర్ తీరు ఏపీ ప్రజలకు తెలుసని.. రెండు రాష్ట్రాలు బీఆర్ఎస్‌కి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని పేర్కొన్నారు.

Rishabh Pant: అక్కడ గుంతలేమీ లేవు.. సీఎంకు జాతీయ రహదారుల శాఖ కౌంటర్

‘‘ఏపీలో జనసేనను, జనసేనతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచేందుకు కేసీఆర్ ‘బీఆర్ఎస్’ రూపంలో ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ చేరికల పరిణామమే అందుకు సంకేతాలిస్తున్నాయి. తెలంగాణ ప్రజలను మోసగించినట్లే, ఏపీలోనూ ప్రజలను నమ్మించగలుగుతానని కేసీఆర్ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఏపీలో రాజ్యాధికార అర్హత కలిగిన బలమైన సామాజిక వర్గాన్ని బీజేపీకి దూరం చేసేందుకు కేసీఆర్ బిఆర్ఎస్ పేరుతో చేస్తున్న దుష్ప్రయత్నాన్ని ఏపీతోపాటు తెలంగాణలో రాజకీయంగా వెనక్కు నెట్టివేయబడ్డ అన్ని వర్గాల సముదాయాలు అర్థం చేసుకుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ధనిక తెలంగాణను అప్పులపాలు చేసి, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ తీరు ఏపీ ప్రజలకి తెలియంది కాదు. రెండు రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్‌కి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం’’ అంటూ విజయశాంతి వరుస ట్వీట్లు చేశారు.

Sunil Kanugolu: హైకోర్టులో సునీల్‌కి చుక్కెదుకు.. పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందే!

అంతకుముందు కూడా.. సర్పంచ్‌లను కేసీఆర్‌ భిక్షగాళ్లను చేశారంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కారు తీరు చూస్తుంటే.. తన ఇంటిని తానే దోచుకుంటున్న వైనంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల డిజిటల్ కీస్‌ని అధికారుల సాయంతో ఉపయోగించి.. నిధులు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా కరెంట్ బిల్లులు కట్టలేక, కార్మికులకు జీతాలివ్వలేక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్పులు చేసి మరీ గ్రామాభివృద్ధికి పనులు చేయిస్తే.. ఆ బిల్లులు ఇవ్వకపోగా, ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని సైతం లాక్కుంటున్నారని ఆరోపణలు చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. చివరికి భిక్షాటన చేసే పరిస్థితికి సర్పంచ్‌లను దిగజార్చారని విజయశాంతి మండిపడ్డారు.

Exit mobile version