Site icon NTV Telugu

రైతుల‌కు ఇచ్చిన‌ట్లే.. సాయితేజ‌కు కేసీఆర్ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి : వీహెచ్‌

రైతులు చనిపోతే రూ.3 లక్షలు ఇస్తానన్న సీఎం కేసీఆర్‌..సాయితేజ కి కూడా ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు వి హ‌నుమంత‌రావు. దేశం కోసం చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ఇస్తే యువత ఢిపెన్స్ లో చేరేందుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు. బిపిన్ రావత్ దగ్గర పనిచేసే సాయితేజ చనిపోయాడు..తాను అయన కుటుంబాన్ని ఇవాళ పరామర్శించానన్నారు.

కానీ… దేశానికి సేవ చేసిన సాయితేజ అంత్యక్రియల్లో తెలంగాణ మంత్రి ఒక్క‌రూ కూడా పాల్గొనలేదనిఫైర్ అయ్యారు. సానియామీర్జా, పివి సింధుల‌కు కోటి రూపాయలు ఇస్తారని..కానీ దేశానికి సేవ చేసిన సాయితేజ కు ఏం ఇవ్వరా.. అని నిల‌దీశారు. తెలుగు వాళ్ళు ఒక్కరిని ఒక్కరు గౌరవించుకోరా… దేశం కోసం చనిపోయిన సాయితేజ.. కేసీఆర్ కు గుర్తు లేడా అని ప్ర‌శ్నించారు.

Exit mobile version