Site icon NTV Telugu

అన్ లాక్: ఆలయాల్లో భక్తుల దర్శనాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అత్యవసర ప్రాతిపదికన శనివారం మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గం లౌక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో రేపటి నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయని దేవస్థాన యాజమాన్యం తెలిపింది. గత నెల మే 12న ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేయగా.. 38 రోజుల అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోను రేపటి నుండి దర్శనాలు ప్రారంభం కానున్నాయి.

Exit mobile version