NTV Telugu Site icon

Vemula Prashanth Reddy: అక్బరుద్దీన్ మీ సహనం తగ్గిపోతుంది

Vemula Prashanthreddy

Vemula Prashanthreddy

Vemula Prashanth Reddy: అక్బరుద్దీన్ మీ సహనం తగ్గిపోతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎంఐఎం అక్బరుద్దీన్‌ పై సెటైర్‌ వేశారు. నేను ప్రభుత్వం గురించి పొగిడితే ఇంకా మాట్లాడమని అంటారని, ఉమ్మడి ఏపిలో సీఎం రోశయ్య నా ప్రసంగం బాగుందని అన్నారు. మాకు కోపం కాదు… అక్బరుద్దీన్ కి కోపం వస్తుందని సెటైర్‌ వేశారు. ఇంతకు ముందు అక్బరుద్దీన్ బాగానే మాట్లాడే వారని ఇప్పుడు ఎందుకు కోపం వస్తుందో తెలియదన్నారు ప్రశాంత్‌ రెడ్డి. గవర్నర్ స్పీచ్ మీద మాట్లాడమని చెప్పండి అంటూ అక్బరుద్దీన్‌ పై వ్యంగాస్త్రం వేశారు.

Read also: MIM V/s BRS: అక్బరుద్దీన్ ఓవైసీ వర్సెస్ కేటీఆర్.. గొంతు చించుకున్నంత మాత్రాన..

అసెంబ్లీ సమావేశంలో.. MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడిన విషయం తెలిసిందే. ఉర్దూకు రెండవ అధికార భాషా తెలంగాణ సర్కార్ ఇచ్చిందని, కానీ ఉర్దూకు ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయంలో మసీదు నిర్మాణం ఏ స్టేజిలో ఉందో చెప్పాలని శాసన సభలో ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేస్తే అభినందనలు చెబుతాం…పనులు కాక పోతే మాట్లాడతామన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీలు కడుతున్నారు. మంచిదే…మరి హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ఎంటి ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి… పాతబస్తీ లో ఆ స్థాయిలో జరగడం లేదని ఆరోపించారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇంకా ఎంత కాలం కావాలి ? అని ప్రశ్నించారు అక్బరుద్దీన్‌. పాతబస్తీ లో మెట్రో సంగతి ఎంటి ? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ లో ప్రభుత్వం హామీలు ఇస్తుంది …వాటిని అమలు చేయదా ? అన్నారు.

Read also: MIM Akbaruddin Owaisi: ఉర్దూకి అన్యాయం.. పాతబస్తీలో మెట్రో సంగతి ఏంటి?

సీఎం కేసీఅర్, మంత్రులు బిజీగా ఉంటారు..మాకు తెలుసు, మీరు చప్రసి అయిన చూపించండి … తెలంగాణ కోసం, పాతబస్తీ వారిని అయిన కలుస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడుపుతున్నారు. BRS పెట్టినందుకు అభినందనలు. మమ్మల్ని బీ టీమ్ అన్నారు… ఇప్పుడు మీరు జాతీయ స్థాయిలో వెళ్లారు. ఏ టీమ్ అంటారో? రెండు పార్టీలు మాత్రమే ఉండాలని కొందరు అనుకుంటారని సెటైర్‌ వేశారు. పాత బస్తిని ఇస్తాంబుల్ చేస్తామని కేసీఅర్ అన్నారు …కానీ ఉన్న స్థాయిలో అభివృద్ధి చేయండని అన్నారు. హైదరాబాద్ నగరంలో నేరాలు పెరుగుతున్నాయి.. 70 శాతం సిసిటివి కెమేరాల నిర్వహణ సరిగ్గా లేదని మండిపడ్డారు. రైతు రుణ మాఫీ చేయండి, హైదరాబాద్ పాతబస్తీ లో మెట్రో పూర్తి చేయండని కోరారు. PRC ఎప్పుడు ఇస్తారు ? కొత్త నగరంలా …పాతబస్తీ నీ అభివృద్ధి చేయండని తెలిపారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారు అయితే దానిని అమలు చేయండి అని అన్నారు.

Show comments