NTV Telugu Site icon

Vegetable Prices: వామ్మో ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలు.. జంకుతున్న సామాన్యులు..!

Vegitables

Vegitables

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్లు లేదు అనే పరిస్థితి ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో లేని విధంగా రోజు రోజుకు ధరలు పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయితే, ఎండకాలంలో తక్కువ ధరకే దొరికే కూరగాయలు రేట్లు ఇప్పుడు అమాంతం పెరిగిపోయాయి. కూరగాయల ధరలు ఏకంగా చికెన్, మటన్ రేట్లతో పోటీ పడుతున్నాయి.

Read Also: Prajwal Revanna : విదేశాల నుంచి రేపు భారత్ కు తిరిగి రానున్న ప్రజ్వల్ రేవణ్ణ

అయితే, రైతు బజార్‌లో ధరలు పర్వాలేదని అనిపించినా.. బహిరంగ మార్కెట్లలో కూరగాయలను కొనలాంటే సామాన్యులు భయపడిపోతున్నారు. ఇప్పటి వరకు కిలో 15 రూపాయలు ఉన్న టమాట రైతు బజార్‌లో రూ.30 దాటితే.. బయట మార్కెట్ లో కిలో రూ.50 నుంచి 60 చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. ఇక బీరకాయ, సొరకాయ బీన్స్ మధ్య తరగతి ప్రజలు తినలేని పరిస్థితి ఏర్పాడింది.

Read Also: Kadapa DSP: కడప జిల్లాలో 144 సెక్షన్.. రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కేసులే..

ఇక, రైతు బజార్లలో గుండు బీన్స్ కిలో ధర 155 రూపాయలు, గింజ చిక్కుడు 85 రూపాయలు, పచ్చ కాకర 55 రూపాయలు, బెండకాయ 45 రూపాయలు ఉండగా ఇక, పచ్చిమిర్చి కిలో 50 రూపాయలు పలుకుతోంది. కానీ, బహిరంగ మార్కెట్‌లో కొత్తిమీర చిన్నకట్ట రూ.10కి అమ్ముతున్నారు. హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్లకు రోజుకు 5 వేల క్వింటాళ్ల కూరగాయలు రావాల్సి ఉండగా.. ప్రస్తుతం రూ.2,800 టన్నులు మాత్రమే రావడం వల్ల ధరలు పెరిగాయని చెబుతున్నారు. అలాగే, వాతావరణంలో మార్పుల కారణంగా కూరగాయ దిగుబడి బాగా తగ్గిపోయిందని సన్నకారు రైతులు పేర్కొంటున్నారు. మరో రెండు నెలలు వరకు రేట్లు తగ్గే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు.