VC Sajjnar : తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, పలువురు కీలక అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇప్పటివరకు పనిచేసిన వీసీ సజ్జనార్, తన పదవీకాలంలో చివరి రోజును సాధారణ ప్రజల మాదిరిగానే గడిపారు. ప్రజా రవాణాపై తనకున్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ, సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. హైదరాబాద్ లక్డీకాపుల్‌లోని టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి 113 I/M రూట్ బస్సులో ఎక్కి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బస్ భవన్ వరకు ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా యూపీఐ ద్వారా చెల్లింపు చేసి కండక్టర్ వద్ద నుంచి టికెట్ తీసుకున్నారు. ప్రయాణంలో సహ ప్రయాణికులతో ముచ్చటిస్తూ, వారి అనుభవాలు, సమస్యలు, ఆర్టీసీ రవాణా సదుపాయాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
Kakinada: కాకినాడలో జనసేన వీర మహిళల అసహనం
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం, పలువురు కీలక ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్థానచలనం జరిగింది. ముఖ్యంగా శాంతిభద్రతల నిర్వహణ, పోలీస్ వ్యవస్థ బలోపేతం, ట్రాఫిక్ నియంత్రణ వంటి విభాగాలపై దృష్టి సారించేందుకు కొత్త నియామకాలు చేపట్టబడ్డాయి. హైదరాబాద్ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ ను నియమించారు. అక్టోబర్ 1న ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీసీ సజ్జనార్ పేరు చెప్పగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది.. ఆయన క్రమశిక్షణ, శాంతిభద్రతల పట్ల చూపే కట్టుదిట్టమైన వైఖరి.
ఐపీఎస్ అధికారి హోదాలో పలు కీలక విభాగాల్లో పనిచేసిన ఆయనకు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు తిరిగి స్వీకరించడం, సిటీ శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు, సైబర్ క్రైమ్ నియంత్రణ వంటి అంశాల్లో ఆయనపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. తన చివరి రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సాధారణ ప్రజలతో కలసిపోవడం ద్వారా సజ్జనార్ ఇచ్చిన సందేశం స్పష్టమే – ఏ పదవిలో ఉన్నా ప్రజలతో అనుబంధం కొనసాగుతుందని. హైదరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టబోయే సందర్భంలో, ప్రజల మధ్య సాన్నిహిత్యం ఆయనకు మరింత బలం చేకూర్చనుంది.
Donald Trump: డూ ఆర్ డై గేమ్ ఆడుతున్న ట్రంప్.. గెలిస్తే నోబెల్ పక్కా అంటా!
