Site icon NTV Telugu

దిశ కేసులో హైపవర్ కమీషన్ ముందు హాజరైన సజ్జనార్…

దిశ కేసులో హైపవర్ కమీషన్ ముందు వరుసగా రెండవరోజు సజ్జనార్ హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ ఎండీ గా ఉన్నారు సజ్జనార్. అయితే దిశ నిందితుల ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ కమిషన్ గా ఉన్న సజ్జన్నార్ నేడు మరోసారి ప్రశ్నించనుంది కమిషన్. దిశ ఘటన పరిణామాల తరువాత ఎన్కౌంటర్ కు దారితీసిన పరిస్థితి తులపై కమిషన్ విచారణ జరపనుంది. అయితే ఇప్పటికే సిట్ ఇంచార్జ్ మహేష్ బగవత్, హోం శాఖ సెక్రెటరీ, బాధిత కుటంబాలు, ప్రత్యక్ష సాక్షులు, డాక్టర్స్, ఫోరెన్సిక్ నిపుణులు, రెవిన్యూ అధికారులను విచారించింది కమిషన్. అయితే ఈకేసులో సజ్జనార్ స్టేట్మెంట్ మరింత కీలకం కానుంది. ఈ విచారణ అనంతరం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది కమిషన్.

Exit mobile version