Vande Bharat Ticket Rates: తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే మంత్రి, ఇతర కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఛార్జీల వివరాలు బయటకు వచ్చాయి. రేపు సోమవారం (జనవరి 16) నుంచి ప్రయాణికులు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనే రెండు రకాల టిక్కెట్ కేటగిరీలు ఉన్నాయని పేర్కొన్నారు.
Read also: Delivery Boy: కుక్క దాడిలో డెలివరీ బాయ్ మృతి.. గత మూడు రోజులుగా కోమాలో..
విశాఖపట్నం నుండి సికింద్రాబాద్‌కు టిక్కెట్టు ధర.. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం టిక్కెట్టు ధర ఒకేలా లేదు. చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు చైర్‌కార్ టికెట్ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.3,170. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే అదే సర్వీసులో విశాఖపట్నం వెళ్లేందుకు చైర్ కార్ టికెట్ ధర రూ.1,665, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.3,120 గా ఉంది.
ఈ టిక్కెట్ల ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది. సాధారణంగా, ఇది అక్కడి నుండి ఎంత దూరంలో ఉంటుందో ఇక్కడ నుండి కూడా అంతే దూరంలో ఉంటుంది. అయితే, అప్ అండ్ డౌన్ రైలు టిక్కెట్ ధరలు భిన్నంగా ఉంటాయి. అయితే, మొత్తం టికెట్ ధరలో చేర్చబడిన క్యాటరింగ్ ఛార్జీలు భిన్నంగా ఉండటంతో ఈ వ్యత్యాసం కనిపిస్తోంది.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు చైర్‌కారును టికెట్ ధరలు..
* బేస్ ఫేర్ రూ.1,207
* రిజర్వేషన్ ఛార్జీ రూ.40
* సూపర్ ఫాస్ట్ ఛార్జీ రూ.45
* మొత్తం జీఎస్టీ రూ.65
* రైలులో అందించే ఆహారం రూ.308
విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు వందే భారత్ రైలు చైర్ కారును టికెట్ ధర వేరుగా ఉంటుంది.
* బేస్ ఛార్జీ రూ.1206
* క్యాటరింగ్ ఛార్జీ రూ.364 (ఇక్కడ టికెట్ ధరలో రూ.60 తేడా )
Airport Metro: శరవేగంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణం.. 21 కిలోమీటర్లు సర్వే పూర్తి