Site icon NTV Telugu

TU In-charge VC: టీయూ ఇన్‌ఛార్జ్ వీసీగా వాకాటి కరుణ..

Vc Vakati Karuna

Vc Vakati Karuna

TU In-charge VC: తెలంగాణ యూనివర్సిటీ గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. టీయూలో రోజుకో వివాదం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా టీయూ వీసీ, రిజిస్ట్రార్ల నియామకం ఉన్నతాధికారులకు తలనొప్పి తెస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ యూనివర్సిటీకి కొత్త ఇన్ చార్జి వీసీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టీయూ ఇన్ చార్జి వీసీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం వీసీగా పనిచేసిన డాక్టర్ రవీందర్ గుప్తా జూన్ 17న ప్రైవేట్ కళాశాలకు పరీక్షా కేంద్రం మంజూరు చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి జైలుకు వెళ్లాడు. అప్పటి నుంచి వీసీ లేకపోవడంతో వర్సిటీ కార్యకలాపాలు స్తంభించిపోవడంతో ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు అందక ఇబ్బందులు పడుతోంది. కొత్త వీసీని నియమించే వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు.

Read also: Asaduddin Owaisi: మీ గేదె పాలు ఇవ్వకపోయినా మాదే తప్పా?.. హిమంతకు ఒవైసీ కౌంటర్

అయితే దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉన్న రవీందర్ గుప్తా బెయిల్ పై విడుదలైన రోజే వాకాటి కరుణను ఇన్ చార్జి వీసీగా నియమించడం గమనార్హం. టీయూ ఇన్‌చార్జి వీసీగా ఐఏఎస్ అధికారిని నియమించడం ఇది ఐదోసారి. సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి వాకాటి కరుణను ప్రభుత్వం ఇన్‌చార్జి వీసీగా నియమించడంతో టీయూలో హర్షం వ్యక్తమవుతోంది. వీసీ రవీందర్‌ సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో అవినీతి, అక్రమాలకు పాల్పడి అరెస్ట్‌ కావడంతో అతడిని సర్వీసు నుంచి తొలగించారు. అవినీతి కేసులో వీసీ నిర్దోషిగా బయటపడడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. వాకాటి కరుణ నేతృత్వంలో పాలనను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈసీ సమావేశాలకు వీసీగా రవీందర్‌గుప్త గైర్హాజరైన సందర్భాల్లో వాకాటి కరుణ అధ్యక్షతన పాలకవర్గ సమావేశాలు జరిగాయి. విద్యాశాఖ కార్యదర్శిగా టీయూలో జరిగే ప్రతి అంశంపై పూర్తి అవగాహన ఉన్న ఆమెకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
Rajamouli: ఒక్క పార్ట్ కే పాన్ వరల్డ్ షేక్ అయ్యింది, ఇక రెండు అంటే అంతే సంగతి

Exit mobile version