దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో సెకండ్ వేవ్ దాదాపుగా ముగిసినట్టే అని వైద్యశాఖాధికారులు చెబుతున్నారు. తెలంగాణలో కేసులు అత్యల్పస్థాయిలో నమోదవుతుండటం విశేషం. కేసులు తక్కువగా నమోదవుతున్నప్పటికీ, మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి వైద్యనిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటేనే పబ్లిక్ ప్లేసుల్లో తిరగడానికి అనుమతిపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా వైద్యశాఖాధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా త్వరలోనే ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు వైద్యశాఖ పేర్కొన్నది. భవిష్యత్తులో కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా ప్రతి వ్యక్తి వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. అప్పుడే మహమ్మారిని తరిమికొట్టగలమని అంటున్నారు వైద్యనిపుణులు.
Read: ఏపీ కరోనా అప్డేట్…