Site icon NTV Telugu

టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్.. చివరి స్థానంలో రంగారెడ్డి జిల్లా

తెలంగాణ 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల లోపు టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ అందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు హన్మకొండలో 103 శాతం మేర వ్యాక్సినేషన్ జరగ్గా… రంగారెడ్డి జిల్లా 51 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లాలో 1,77,102 మంది 15 నుంచి 17 ఏళ్ల లోపువారుండగా.. కేవలం 90,046 మందికే ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ వేశారు. అటు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కవరేజీ 70 శాతం లోపే ఉంది.

Read Also: రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

చివరి నుంచి రెండో స్థానంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నిలిచింది. ఆ జిల్లాలో 52 శాతం మంది టీనేజర్లకు మాత్రమే వ్యాక్సిన్ అందినట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్ జిల్లాలో 26,783 మంది టీనేజర్లు ఉండగా 14,054 మందికి మాత్రమే టీకాలు వేశారు. హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలలో 55 శాతం మందికి కరోనా టీకా ఇచ్చారు. జనవరి తొలి వారంలో తాము అంచనా వేసిన దాని కన్నా నెమ్మదిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోందని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.

Exit mobile version