V.Hanumantha Rao: ఖమ్మం టికెట్ తనకిస్తే మెజారిటీతో గెలుస్తానని మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల కలిశానని.. ఖమ్మం లోక్ సభ సీటు ఇవ్వాలని కోరానని అన్నారు.పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. రాజీవ్ గాంధీతో అక్కడే తిరిగానని అన్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు ఉన్నారో తెలియాలన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రికార్డ్ చేశారని తెలిపారు. ఇందులో ఇంకా చాలా అంశాలు బయటకు రావాలని అన్నారు. రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో అసలు సూత్రధారులు ఎవరు? ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారని అన్నారు.
Read also: Mumbai : ముంబైలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
నయీం అనే గ్యాంగ్ స్టార్ట్ గతంలో కోట్ల రూపాయలు, భూములు కజేశాడన్నారు. నయీం మరణం తర్వాత అక్కడ దొరికిన డబ్బులు ఏమయ్యాయి ? అని ప్రశ్నించారు. సీట్ అధికారిగా నాగిరెడ్డి ఉన్నారని తెలిపారు. పేదల భూములు నయీం లాక్కున్నారు ఏమయ్యాయి అవి అని ప్రశ్నించారు. శివనంద రెడ్డి ఎస్పీ నీ పట్టుకోవడానికి వెళ్తే అప్పుడు ఆయన తప్పించుకొని పారిపోయారన్నారు. 2500 కోట్ల ఆస్తులు, భూములు ఆక్రమించారన్నారు. శివనంద రెడ్డి వెనుక నయీం ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వీటి పై విచారణ జరిపితే ఆ భూములను పేద ప్రజలకు ఇవ్వొచ్చన్నారు. నయీం డబ్బులు,సొమ్ము ఏమయ్యాయి ఎవరు చెప్పలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ ను ప్రభుత్వం ఎలా సీరియస్ గా తీసుకుందో ,నయీం డబ్బులు,అస్తులు ఏమయాయ్యో విచారణ జరపాలన్నారు.
Pawan Kalyan: బాప్టిస్ట్ చర్చిలో పవన్ ప్రత్యేక ప్రార్థనలు.. అన్ని మతాలను గౌరవిస్తాను