ఇటీవల సికింద్రాబాద్ తుకారాం గేట్ వద్ద నివసిస్తున్న యువ మహిళా క్రికెటర్ భోగి శ్రావణి తల్లి చనిపోవడంతో, తండ్రి మల్లేష్ తో కలిసి నివసిస్తుంది. అయితే తెరాస నాయకుల ప్రలోభాలకు తలొగ్గి, శ్రావణి ఇల్లు శిధిలావస్థకు చేరిందని బూచి చూపుతూ గ్రేటర్ అధికారులు, శ్రావణి ఇంట్లో సామగ్రిని బయటపడేయడమే కాకుండా, జీఎచ్ఎంసీ అధికారులు ఇంటిని కూల్చివేయడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారిణి శ్రావణికి మద్దతుగా ఆమె ఇంటి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధర్నా నిర్వహించారు.
దళిత క్రీడాకారిణి శ్రావణికి న్యాయం జరిగే వరకూ మా పోరాటం కొనసాగిస్తామన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి శ్రావణికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇతర క్రీడాకారులకు సహాయం చేస్తున్న సీఎం.. శ్రావణి ఒక దళిత బిడ్డ కాబట్టి సీఎం పాటించుకోట్లేదని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కూల్చివేసిన చోటే ప్రభుత్వం శ్రావణి కు ఇల్లు నిర్మాణం చేయాలని, అదే విధంగా క్రీడల్లో కూడా ఆమె మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని ఆయన కోరారు.
