Site icon NTV Telugu

కౌశిక్‌ రెడ్డి వివాదంపై స్పందించిన ఉత్తమ్‌

కౌశిక్‌ రెడ్డి రాజీనామాపై మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కౌశిక్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. కాంగ్రెస్ లో 2018 లో హుజురాబాద్ టికెట్ రావడం వల్లనే కౌశిక్ రెడ్డి లీడర్ అయ్యాడన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీని.. పార్టీలోని నాయకులను విమర్శించడం సిగ్గుచేటు తెలిపారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మనిక్కమ్ ఠాగూర్ లపై కౌశిక్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు.

read also : రాయలసీమ ఎత్తిపోతలపై ధిక్కరణ పిటిషన్‌ వేసిన తెలంగాణ

ఇవి టిఆర్ఎస్ నాయకులు చేయిస్తున్న ఆరోపణలు అని.. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించామన్నారు. ఎవరైనా నాయకులు.. వారి స్థాయి తెలుసుకొని మాట్లాడాలని…. కౌశిక్ రెడ్డి స్థాయి మరిచిపోయి ఇష్టానుసారంగా మాట్లాడారని ఫైర్‌ అయ్యారు. టిఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి కౌశిక్ అలా మాట్లాడారని స్పష్టంగా తెలుస్తుందని మండిపడ్డారు.

Exit mobile version