Site icon NTV Telugu

Uttam Kumar Reddy: త్వరలో మేడిగడ్డకి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి.. రెండో సారి సమీక్ష

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Uttam Kumar Reddy: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లీకేజీలు, పిల్లర్లు కూలిన ఘటనలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడిగడ్డ, అన్నారం ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. దీనిపై తెలంగాణ శాసనమండలిలో సుదీర్ఘ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే.. అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో మెడిగడ్డ పిల్లర్ల అంశాలపై ఈ.ఏన్.సి మురళీధర్, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో రెండోసారి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్వరలోనే మేడిగడ్డకి వెళ్లనున్నట్లు సమాచారం. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై పారదర్శక విచారణకి అదేశిస్తామని నిన్న కౌన్సిల్ లో సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటాం అన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు, వాటి వెనుక మంత్రులు ఎవరు..? అధికారుల పాత్రతో సహా అన్నింటినీ వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

Read also: Bihar: పూజారి హత్యతో బీహార్‌లో టెన్షన్ టెన్షన్.. కళ్లను పొడిచి, నాలుక కోసేసి పాశవికంగా చంపేసిన వైనం..

మరోవైపు మేడిగడ్డ బ్యారేజీలో జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడం తమ పని కాదని మేడిగడ్డ నిర్మాణ సంస్థ పేర్కొంది. మేడిగడ్డలో బ్యారేజీ కూలిపోవడంతో పాటు దెబ్బతిన్న పైర్లను పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు అనుబంధ ఒప్పందం కుదిరితేనే పనుల్లో ముందడుగు వేస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ, బ్యారేజీ కూలిపోయినప్పుడు నిర్వహణ ఇంకా మిగిలి ఉంది మరియు M&T ప్రాజెక్ట్ ఇంజనీర్లు అధికారికంగా నిర్మాణ సంస్థ మొత్తం పునరుద్ధరణ ఖర్చును భరిస్తుందని ప్రకటించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఓ ప్రకటన కూడా చేసింది. అయితే ఇప్పుడు ఇందుకు భిన్నంగా మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజినీర్ చీఫ్, కింది స్థాయి ఇంజనీర్లకు లేఖ పంపారు.
Prabhas: ఆరు హెలికాప్టర్లతో ప్రభాస్ కు సినిమాటిక్ సెల్యూట్ చేసిన కెనడా ఫ్యాన్స్

Exit mobile version