NTV Telugu Site icon

Uttam Kumar Reddy: ఏపీకి 512.. టీఎస్‌ కి 299 టీఎంసీ ఎలా ఒప్పుకున్నారు? ఇది అన్యాయం కాదా?

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Uttam Kumar Reddy: ఏపీకి 512.. టీఎస్‌ కి 299 టీఎంసీకి ఎలా ఒప్పుకున్నారు? ఇది తెలంగాణకు అన్యాయం కాదా? అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్లు తెలంగాణకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు ఆంధ్ర 512 టీఎంసీ లు తీసుకుని వెళ్లేందుకు బీఆర్ఎస్ అంగీకారం చెప్పిందని.. ఇది తెలంగాణ కి అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏపీ వచ్చి తెలంగాణాకి 50:50 కావాలి అంటున్నారని తెలిపారు. దీనిపై సభలో కృష్ణ నది మీద పవర్ పాయింట్ పై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రజెంటేషన్ చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా ప్రసెంటేషన్ ఇస్తున్నామని తెలిపారు. KRMB నీ రెండు రాష్ట్రాల నీటి వాటా తేల్చేందుకు ఏర్పాటు చేశారు. నీటి పంపకాల విషయంలో గత ప్రభుత్వం ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదని అన్నారు. ఎన్నికలకు ఒక్క రోజు ముందు నాగార్జున సాగర్ ను ఏపి పోలీసులు ఆక్రమించారన్నారు. KRMB కి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు అప్పగించేది లేదని చెప్పింది. తెలంగాణ ప్రజలను కొన్ని అపోహలకు గురిచేస్తున్నారని, దాని మీద వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. భారత దేశంలో గంగా గోదావరి తర్వాత కృష్ణానది పెద్దదని తెలిపారు. మహారాష్ట్ర మహాబలేశ్వర్ లో ప్రారంభమై బంగాళాఖాతంలో కలుస్తుందన్నారు.

Read also: Bihar Floor Test: బీహార్ లో బలపరీక్షకు ముందు ఇద్దరు ఎమ్మెల్యేలు మిస్సింగ్.. టెన్షన్ లో నితీశ్

గత పాలకుల వల్ల తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ నది వాటా లో అన్యాయం జరిగిందని పోరాటం చేశారన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత న్యాయం జరుగుతుంది అనుకున్నామని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో..60 ఏళ్ల పాలన కన్న ఎక్కువ అన్యాయం జరిగిందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎంత ఇల్లీగల్ గా నీటి తరలింపు జరిగిందో తెలిస్తే ఆశ్చర్య పోతారన్నారు. 2004-14 పది వేళ 665 టీఎంసీ లు వస్తె 727 టీఎంసీ నీళ్ళు తరలి పోతే.. 12వందల టీఎంసీ లు ఉంటే 812 టీఎంసీ లు అక్రమంగా తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తరలించనున్నారని తెలిపారు. గతం కన్నా 50శాతం ఎక్కువ నీటిని తరలించనున్నారని అన్నారు. నీటి వాటా విషయంలో కేసిఆర్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. నీటి వాటాల పంపకాల విషయంలో నీరు ఎంత భూ భాగంలో ప్రవహిస్తుంది.. ఇక్కడ ఉన్న జనాభా ఆధారంగా కేటాయింపు జరగాలన్నారు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి..299 టీఎంసీ లకు ఒప్పుకొని కృష్ణ నది లో నీటి వాటా లో తెలంగాణ కి శాశ్వత నష్టం చేశారని మండిపడ్డారు. అప్పటికే అన్ని ప్రాజెక్టులు కృష్ణ నది మీద నిర్మాణాలు ప్రారంభమైనాయన్నారు. కేసిఆర్ ఎన్నిసార్లు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడారని తెలిపారు. 27500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కలుపుకొని 599 టీఎంసీ అవసరం ఉంటే బోర్డును ఎందుకు అడగలేదన్నారు.

Rapido Bike: పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్‌.. తోసుకుంటూ వెళ్లిన రాపిడో డ్రైవర్!