Uttam Kumar Reddy : జలాల్లో హక్కు వాటా కోసం ఏ రాష్ట్రంతోనైనా పోరాడుతాం
- ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుకు తెలంగాణ తీవ్ర వ్యతిరేకత
- సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫున వాదనలు వినిపించనున్న ఉత్తమ్
- కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు
- జలాల్లో హక్కు వాటా కోసం ఏ రాష్ట్రంతోనైనా పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జలాల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, అవసరం అయితే ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదులలో తెలంగాణకు చట్టబద్ధంగా లభించాల్సిన హక్కు వాటాను కచ్చితంగా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోందని గుర్తుచేశారు. రేపు ఢిల్లీకి వెళ్లి తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపిస్తానని, ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.
X Account Hack: ఎవర్రా మీరంతా.. ఏకంగా డిప్యూటీ సీఎం ఎక్స్ అకౌంట్‌నే హ్యాక్ చేశారు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణను ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టులో ఎవరైనా తప్పు చేసి ఉంటే వారు ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కాదని మంత్రి హెచ్చరించారు. తగిన ఆధారాలు బయటకు వస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన వెల్లడించారు. జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని వివరించిన ఉత్తమ్, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో ఎవరితోనైనా, ఏ స్థాయిలోనైనా పోరాటానికి వెనుకాడమని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read
The last Solar Eclipse : ఈ ఏడాదిలో నేడు కనిపించనున్న చివరి సూర్య గ్రహణం..
తాజావార్తలు
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!