NTV Telugu Site icon

Uttam Kumar Reddy: కేంద్ర బడ్జెట్‌పై ఉత్తమ్ ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్

Uttam Kumar On Budget

Uttam Kumar On Budget

Uttam Kumar Reddy Fires On Central Budget And KCR: ఈరోజు పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ తెలంగాణను నిరుత్సాహపరిచిందని పేర్కొన్నారు. ఇది పేదల వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు. ఆర్థికమంత్రి ప్రసంగంలో తెలంగాణకు ప్రత్యేక ప్రకటనలేవీ లేవన్నారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి కూడా ప్రస్తావన లేదని మండిపడ్డారు. పునర్విభజన చట్టాన్ని ఆమోదించి పదేళ్లు అవుతున్నా.. ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో మిల్లెట్ రిచెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నట్లు.. గతంలోనూ అనేక ఉత్తుత్తి హామీలు ఇచ్చారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి సీఎం కేసీఆర్ బాధ్యత కూడా ఉందన్నారు. తెలంగాణకు అవసరమైన నిధులు రాబట్టేలా.. బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు.

Union Budget 2023: ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీర..ఎవరు గిఫ్ట్‌ ఇచ్చారంటే!

ఇదే సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఇది పెత్తందారులకి అనుకూల బడ్జెట్ అని ఫైర్ అయ్యారు. కార్పొరేట్ శక్తులకు లాభం చేసే పనిలో నిర్మలా సీతారామన్ ఉన్నారన్నారు. ఈ బడ్జెట్ పేదలకు ఉపకరించేది లేదని, బడ్జెట్‌లో కూడా బీజేపీ రాజకీయమే చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలున్న రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చి, ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేశారన్నారు. మోడీ హామీల అమలుకు కేటాయింపులు లేవని, ఉద్యోగాల కల్పనపై దృష్టి లేదని దుయ్యబట్టారు. పేదలకు అన్నం పెట్టే ఉపాధి హామీకి నిధుల కోత పెట్టారన్నారు. ఏకంగా రూ.29 వేల కోట్లు కోత పెట్టారంటే.. పేదల పట్ల బీజేపీ కపట ప్రేమ బయటపడింద్నారు. ఉపాధి హామీ కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన అపూర్వ పథకమని తెలియజేశారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ మెల్లమెల్లగా పక్కకు పెట్టే పనిలో ఉందని విమర్శించారు.

MLC Kavitha: మోడీ ప్రభుత్వం విఫలమైందనడానికి ఈ బడ్జెటే ఉదాహరణ

Show comments