Site icon NTV Telugu

Uttam Kumar: నాణ్యత లేకుండా ఎలా చేసారు.. ఎల్ అండ్ టి ప్రతినిధులపై ఉత్తమ్ ఫైర్‌

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Uttam Kumar: అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరకం పనులు చేసారని, ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. సచివాలయంలో మెడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టి ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో ఎల్ అండ్ టి గ్రూప్ డైరెక్టర్ ఎస్. వి దేశాయ్ పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో మంత్రి ఉత్తమ్ ఎల్.అండ్ టి ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరకం పనులు చేసారని మండిపడ్డారు. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని ఉత్తమ్ నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని వార్నింగ్‌ ఇచ్చారు. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి. అన్నారం, సిందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తపించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

Read also: Salaar Trailer: ఏ బాబు లేవ్… రిలీజ్ ట్రైలర్ ఏడ?

గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ మీటింగ్ కు ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రే అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు తదితరులు వచ్చారు. అయితే.. మరోవైపు సూర్యాపేట జిల్లా అధికారులతో సమీక్ష కారణంగా సచివాలయం ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలు దేరారు. ఇక మరోవైపు విద్యుత్ పై సమీక్ష కారణంతో పీసీసీ పొలిటికల్ కమిటీ సమావేశం నుంచి సమీక్షకు డిప్యూటీ సీఎం భట్టి వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికలపై సన్నాహకంపై చర్చ కొనసాగుతుండగా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నుంచి వెళ్లిపోవడంతో సర్వత్రా చర్చకు దారితీసింది.
Komati Reddy: తెలంగాణలో కుటుంబ పాలన అంతమైంది.. ప్రజాపాలన ప్రారంభమైంది..

Exit mobile version