Site icon NTV Telugu

Uttamkumar Reddy: తెలంగాణ నీటి ప్రాజెక్టుల పట్ల ఆ పార్టీలకు చిత్తశుద్ధి లేదు

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttamkumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హతకు తగినది కాదని కేంద్రం స్పష్టం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పొలిటికల్ డ్రామాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నీటి ప్రాజెక్టుల పట్ల బీజేపీ, టీఆర్ఎస్‌లకు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. లక్ష 20 వేల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్ట్ స్పాట్‌గా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

Corona Cases are Increasing Again: గురుకుల విద్యార్థులపై కరోనా పంజా.. 15 మందికి పాజిటివ్‌

ఇరిగేషన్‌కు ఇప్పటి వరకు కాళేశ్వరం ఉపయోగపడిన దాఖలాలు లేవన్నారు. క్లౌడ్ బరస్ట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎద్దేవా చేశారు. క్లౌడ్ బరస్ట్ వరదల వల్ల కాళేశ్వరం మునిగిందని సిల్లి కామెంట్లు చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు.. సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దాఖలైన ఆరు పిటిషన్లు కలిపి ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ జులై 27కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

 

Exit mobile version