Uttam Kumar Reddy : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టంచేస్తూ, “మా రిపోర్టుల వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగింది, మా రిపోర్టర్‌ల కృషితోనే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను ఆపింది” అని ఆయన పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి అనర్ధం తెస్తుందని హెచ్చరిస్తూ, “దాన్ని ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతటి సాహసానికైనా సిద్ధం” అని హామీ ఇచ్చారు.
బీఆర్‌ఎస్ నాయకుల వ్యాఖ్యలపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, “ప్రధాన పదవుల్లో ఉన్నవారు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు” అని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన న్యాయపరమైన రిపోర్టును రేపు కేబినెట్‌లో ప్రవేశపెడతామని ప్రకటించారు. “ఆ రిపోర్టు బయటపడ్డాక బీఆర్‌ఎస్ నాయకుల పరిస్థితి ఏమవుతుందో చూడాలి” అని అన్నారు.
Mrunal Thakur: డెకాయిట్ కోసం మృణాల్ ఎదురుచూపులు!
రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ, “40 ఏళ్లుగా ఒకే పార్టీ జెండా పట్టుకున్న లక్ష్మణ్ కుమార్‌ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడమే కాకుండా మొదటిసారి ఎన్నికై మంత్రిగా చేసిన ఘనత రాహుల్ గాంధీదే” అని తెలిపారు.
గోదావరి నది పక్కనే ఉన్నా రైతులకు పంటలకు నీళ్లు అందించడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. “లక్ష్మీ నరసింహస్వామి రిజర్వాయర్‌తో పాటు పట్టిపాక రిజర్వాయర్‌ను నిర్మిస్తాం. రైతుల చివరి పంట వరకూ నీళ్లు అందించే బాధ్యత మేమే తీసుకుంటాం, నిధులు మంజూరు చేస్తాం” అని హామీ ఇచ్చారు.
