NTV Telugu Site icon

Uppal MLA Subhas Reddy: నేను చేసిన తప్పేంటి..? బేతి సుభాష్ రెడ్డి ఆవేదన..!

Uppal Mla Beti Subhash Reddy

Uppal Mla Beti Subhash Reddy

Uppal MLA Subhas Reddy: నన్ను కోసి పడేశారు…నేను చేసిన తప్పు ఎంటి ? ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డీ ఆవదేన వ్యక్తం చేశారు. 2001 నుంచి తాను బీఆర్ ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పారు. పార్టీ అప్పగించిన బాధ్యతను నిర్వర్తించానని చెప్పారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఉప్పల్‌లో పార్టీని కాపాడుకున్నామని తెలిపారు. బండారి లక్ష్మారెడ్డి పార్టీ జెండా ఎత్తారా? అని అడిగారు. బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. లక్ష్మారెడ్డి ట్రస్టు పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారని సుభాష్ రెడ్డి విమర్శించారు. తాను, బొంతు రామ్మోహన్ ఉద్యమకారులమని ఆయన అన్నారు. టికెట్ ఖరారు చేసే ముందు కనీసం తనతో చర్చించలేదన్నారు. నన్ను కోసి పడేశారు…నేను చేసిన తప్పు ఎంటి ? అని ప్రశ్నించారు. మేకను బలిచ్చే ముందు కూడా దానికి నీళ్లు తాగిస్తారని అన్నారు.

పార్టీ పేరుతో గుండయిజం చేసిన వారు ఉన్నారు…డబ్బులు సంపాదించిన వారు ఉన్నారు…అయిన వాళ్లకు టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా వారం పది రోజులు అగుదం… మార్పులు చేర్పులు అని పెద్దలు అంటున్నారని తెలిపారు. పార్టీ పెద్దలు నన్ను ఎందుకు కలవడం లేదు? అని ప్రశ్నించారు. ప్రజలు వెంటే ఉంటా అని అన్నారు. తనను ఎందుకు తొలగించారో చెప్పాలని బీఆర్‌ఎస్ చీఫ్‌ను ప్రశ్నించారు. తన క్యాడర్‌ను ఆందోళనకు గురి చేయబోనని చెప్పారు. 10 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. పార్టీ మారే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీలకతీతంగా పని చేయాలని బీఆర్‌ఎస్‌ తనకు చెప్పలేదన్నారు. ఇతర పార్టీల నుంచి తనకు ఎలాంటి ఆఫర్ రాలేదన్నారు. అయితే భేతి సుభాష్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. భేతి సుభాష్ రెడ్డికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఆఫర్లు ఉన్నాయని ఆయన వర్గం చెబుతోంది.

Read also: Rajanikanth : బెంగళూరు లోని బస్ డిపో ను సందర్శించిన తలైవా..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించడంతో మండిపడుతున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భేతి సుభాష్ రెడ్డికి కాకుండా బండారి లక్ష్మారెడ్డికి బీఆర్‌ఎస్ నాయకత్వం టికెట్ ఇచ్చింది. దీంతో ఉప్పల్ బీఆర్‌ఎస్‌లో కలకలం రేగింది. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఉప్పల్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డితో పాటు హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్‌మోహన్‌, బండారి లక్ష్మారెడ్డికి ఆశిస్తున్నారు.

అయితే భేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్‌లలో ఒకరికి టికెట్ వస్తుందని చాలా మంది అంచనా వేశారు. అయితే బీఆర్‌ఎస్‌ నాయకత్వం బండారి లక్ష్మారెడ్డికి టికెట్‌ కేటాయించింది. దీనిపై ఇరువర్గాలు కూడా అసంతృప్తితో ఉన్నాయి. ఈ క్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి నివాసానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఇన్నాళ్లూ వ్యతిరేక వర్గాలుగా ఉన్న భేతా సుభాష్ రెడ్డి, బొంతు శ్రీదేవి భేటీతో ఉప్పల్ బీఆర్ ఎస్ లో రాజకీయం మరింత వేడెక్కింది. భేతి సుభాష్‌రెడ్డి మంగళవారం కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. రాజకీయ భవిష్యత్తుపై కీలక నేతలతో చర్చలు జరిపారు.
Rajanikanth : బెంగళూరు లోని బస్ డిపో ను సందర్శించిన తలైవా..