హైదారబాద్ మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన మరవకముందే.. అంబర్పేట లోని పటేల్ నగర్ లో 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై పక్కింట్లో ఉండే జయంతి చారి అనే వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించినందుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్పేట పోలీస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. బాలిక నివాసం పక్కనే ఇంట్లో ఓయూలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నటువంటి జయంత్ చారి బాలికను బుక్స్ ఇస్తానని ఇంట్లో పిలుచుకొని అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక భయపడి ఇంట్లో నుండి బయటకు పరిగెత్తుకొచ్చింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ సుధాకర్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
read also: Gujarat Elections: కేజ్రీవాల్ కీలక హామీ.. ఏకంగా 10 లక్షలు
ఇక జూన్ 5న హైదరాబాద్ లోని మొగల్ పురా పోలీస్టేషన్ పరిధిలో బాలిక తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. రోజు సమయానికి ఇంటివచ్చే కుమార్తె ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రుల మొగల్ పురా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ తనను రంగారెడ్డి జిల్లాలోని ఓ..ఊరికి తీసుకెళ్లాడని చెప్పింది. దీంతో మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మార్చిన పోలీసులు వెంటనే లుక్మాన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. లుక్మాన్ కు ఆశ్రయమిచ్చిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Social Media DP Change: డీపీ మార్చుకుంటేనే దేశభక్తి ఉన్నట్లా..?
