NTV Telugu Site icon

Kishan Reddy: మెదక్ – అక్కన్నపేట రైల్వే మార్గం ప్రారంభం.. హాజరుకానున్న బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు

Kishan Reddy

Kishan Reddy

union minister kishan reddy will start the first train from medak today:మెదక్‌ ప్రాంత ప్రజల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరుతోంది. నేడు మెదక్ – అక్కన్న పేట రైల్వే మార్గాన్ని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దాన్వే ప్రారంభించనున్నారు. ఈ మార్గం 17 కిలోమీటర్ల వరకు ఉండగా, మెదక్ నుండి కాచిగూడ స్టేషన్ వరకు ప్యాసింజర్ రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మెతుకుసీమ-మెదక్ ప్రజల దశాబ్దాల చిరకాల కల మెదక్ రైల్వే మార్గం సాకారమైందని జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Earthquake Indonesia: ఇండోనేషియాలో 4.7 తీవ్రతతో భారీ భూకంపం

మెదక్‌ రైల్వేస్టేషన్‌ నుంచి కాచిగూడ వరకు రైలు పరుగులు పెట్టనుంది. ఈనేపథ్యంలో.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు జెండా ఊపి ఈ ప్యాసింజర్‌ రైలును ప్రారంభించనున్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మెదక్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ హాజరుకానున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయితే బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు హాజరుకానుండటంతో సర్వత్రా ఉత్కంఠంగా మారింది. మెదక్‌కు రైలు మార్గం కోసం 2003లో రైల్వే సాధన సమితి పేరిట స్థానిక ప్రజలు ఉద్యమాన్ని ప్రారంభించారు. కాగా.. ఈ క్రమంలో 2012-13 రైల్వే బడ్జెల్‌లో కాస్ట్‌ షేరింగ్‌ పద్ధతిలో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్‌ వరకు బ్రాడ్‌ గేజ్‌ రైల్వేలైన్‌ మంజూరైంది. అనంతరం కేంద్ర ప్రభుత్వ వాటా నిధులన్నీ మంజూరవగా, రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెండింగ్‌లో ఉండడంతో పనులు నత్తనడకన సాగాయి. గత డిసెంబరులో రూ.20 కోట్లు మంజూరవడంతో ఆ మేరకు పనులు జరిగాయి. మెదక్‌ రైల్వే స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. అంతేకాకుండా.. ఈ స్టేషన్‌ నుంచి నిత్యం తెల్లవారుజామున 5 గంటలకు కాచిగూడ ప్యాసింజర్‌ రైలు బయలుదేరుతుంది. నేడు మెదక్‌ రైల్వే స్టేషన్‌ ప్రారంభం సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రజలంతా ఉదయం 11 గంటలకు విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాలని రైల్వే సాధన సమితి ఓ ప్రకటనలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
CM Nitish Kumar: సోనియాగాంధీతో భేటీ కానున్న నితీష్ కుమార్, లాలూ.. మహాకూటమి లక్ష్యంగా అడుగుల