Site icon NTV Telugu

Kishan reddy: బంగారు తెలంగాణ అన్నారు.. కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు

Kishan Reddy

Kishan Reddy

Kishan reddy: బంగారు తెలంగాణగా మారుస్తానని.. సీఎం కేసీఆర్ వాళ్ళ కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ వారసిగుడ సభలో ప్రజా గోస – బీజేపీ భరోసా శక్తి కేంద్రాల్లో బీజేపీ నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈనేపథ్యంలో కిషన్‌ రెడ్డి, సీఎం కేసీఆర్‌ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ కుటుంబాన్ని రెండు సార్లు గెలింపించామని.. బంగారు తెలంగాణ గా మారుస్తా అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడని విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్, విమానాలు కొంటారని, తెలంగాణ ప్రజల డబ్బు దోచుకుంటున్నారని మండిపడ్డారు.

Read also: Banda Prakash: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక.. బండా ప్రకాష్ నామినేషన్

రాష్ట్రాల్లో ఎవరైన నాయకులు ఖాళీగా ఉంటే వారికి డబ్బులు ఇచ్చి బీఆర్‌ఎస్‌ లో చేర్చుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు ఆడటంలో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి కేసీఆర్‌ కుటుంబానికి అంటూ ఎద్దేవ చేశారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణకు శాపమని తెలిపారు. మోడీ మీద విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో 30లక్షలు ఇల్లు కడుతున్నారు, మన రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడి చేసుకొని ఫామ్ హౌజ్ లు కడుతున్నారని నిప్పులు చెరిగారు. వేలాది కోట్ల రూపాయలు వెనకేసుకున్నడు కేసీఆర్‌ అంటూ ఆరోపించారు. ఏ మాఫియా లో చూసిన కేసీఆర్‌ కుటుంబం ఉందని, రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

Read also: KTR V/s Bhatti: భట్టి పై కేటీఆర్ సెటైర్.. 9 నెలల్లో పిల్లులు వస్తారు కానీ..

ప్రజా ఘోష బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పై బీజేపీ నేతలకు రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ సమీక్ష నిర్వహించారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ స్టేట్ టీమ్ తో సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. నిన్న మీటింగ్ లు జరిగిన తీరుపై ఆరా తీసారు. 25 వరకు జరిగే ఈ మీటింగ్స్ సక్సెస్ పై చేయాల్సిన పనులపై దిశా నిర్దేశం చేశారు. సనత్ నగర్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బన్సల్ పాల్గొన్నారు.
Record electricity: తెలంగాణలో విద్యుత్ ఆల్ టైం రికార్డ్.. చుక్కలను తాకుతున్న కరెంట్‌

Exit mobile version