హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వేదికగా రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ – 2022 ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, మెగాస్టార్ చిరంజీవి… తదితరులు పాల్గొన్నారు.. ఇక, రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను సత్కరించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి.దశరథరామారెడ్డిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సత్కరించారు..
ఇక, కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రవి మాట్లాడుతూ.. సంస్కృతితో పాటు అన్ని రంగాల్లో ఇండియా ముందుకు వెళ్తుందన్నారు.. కేవలం ఇండియా మరియు చైనాలు 75 శాతం గ్లోబల్ ఇండస్ట్రియల్ కంట్రీస్ గా ఉన్నాయని.. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు వెళ్తుందన్నారు.. బ్రిటీష్‌వారు దేశాన్ని వదిలి వెళ్లిన తర్వాత మన దగ్గర పేదరికం, నిరక్షరాస్యత ఉండేది… ఇది చాలా కాలం కొనసాగిందన్న ఆయన.. మోడీ నాయకత్వంలో ప్రతివ్యక్తి పేదరికం నుంచి బయటపడ్డాడు.. దేశంలోని ప్రతి వ్యక్తికి ప్రతి అవసరం సులభంగా అందుతుందన్నారు. జన్ ధన్ అకౌంట్స్ తీసినప్పుడు చాలా మంది ఎందుకు అని నవ్వుకున్నారు, కానీ, వాటి ఉపయోగం ఇప్పుడు తెలిసిందన్నారు.. 100వ స్వాత్యంత్ర వేడుకల వరకు ఇండియా నంబర్ వన్‌గా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఎకనామిక్, నాలెజ్డ్, కల్చర్, స్పిరిచువాలిటి అనే నాలుగు పిల్లర్ల మీద దేశ అభివృద్ధి ఉందని తెలిపారు.
