NTV Telugu Site icon

Kishan Reddy: బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడైనా రావొచ్చు..!

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడైనా రావొచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించేందుకు విజయ సంకల్ప యాత్రలు చేస్తున్నారని తెలిపారు. యాత్రలకు మంచి స్పందన ఉంటుందని తెలిపారు. గత 10 సంవత్సరాలు గా మోడీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు యాత్రల ద్వారా ప్రజల ముందు పెట్టామన్నాఉ. అభివృద్ది చెందిన భారత్ కోసం మేనిఫెస్టో తయారీకి ప్రజల నుండి సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. దేశంలో ఇంకా పేదరికం ఉంది, మౌలిక వసతులు, విద్యా, వైద్యము లేదన్నారు. 2047 లో దేశం అభివృద్ది చెందిన దేశంగా ఉండాలనేది బీజేపీ సంకల్పం అన్నారు. GYAN ఎజెండా గా ముందుకు వెళ్తామన్నారు. గరిబ్ కళ్యాణ్(G) యూత్ (Y) అగ్రికల్చర్(A) నారి శక్తి(N)..రెండు రకాల మేనిఫెస్టో లు… ఒకటి 5 సంవత్సరాల కోసం… రెండోది 25 సంవత్సరాల కోసం అన్నారు. ప్రధాని నీ మా ప్రధాని, మన ప్రధాని అనే విధంగా మోడీ పని చేస్తున్నారన్నారు. నిధుల సమీకరణ కూడా చేస్తున్నామన్నారు. మా కార్యకర్తల నుండి మొదలు పెడుతున్నామన్నారు. బీజేపీ ప్రజల చేత స్థాపించబడిందని, ప్రజల కోసం, ప్రజల చేత నడిచే పార్టీ.. బీజేపీ కుటుంబ పార్టీ కాదన్నారు. ఎవరైన ఆర్థిక సహాయం చేయాలని అనుకుంటే నమో యాప్ ద్వారా చేయండన్నారు.

Read also: TSRTC National Award: టీఎస్ఆర్టీసీకి జాతీయస్థాయి అవార్డు.. ఈనెల 15న ఢిల్లీలో..

ప్రధాని 4,5 తేదీల్లో తెలంగాణకి వస్తున్నారన్నారు. అనేక అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారని తెలిపారు. ఘట్కేసర్, లింగంపల్లిల మధ్య ఎంఎంటీఎస్ ట్రైన్ ను మోడీ ప్రారంభిస్తారని తెలిపారు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ నీ ప్రారంభిస్తారన్నారు. నమో యాప్ ద్వారా పార్టీ కిషన్ రెడ్డి ఫండ్ కు ఇచ్చారు. మేనిఫెస్టో కోసం తన అభిప్రాయాన్ని రాసి బాక్స్ లో వేశారు. బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడైనా రావొచ్చన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వంకి బదిలీ చేసిందన్నారు. హైదరాబాద్ -నిజామాబాద్ రూట్, హైదారాబాద్- సిద్దిపేట రూట్ లో 175 ఎకరాల భూమి నీ HMDA కి ఇవ్వనుందని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అనుమతి కూడా తీసుకోవడం జరిగిందన్నారు. మోడీకి, రక్షణ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని వచ్చినప్పుడు ఇన్విటేషన్ లు ఎవరికి ఇవ్వాలో ప్రోటోకాల్ ఉంటుందన్నారు. గతంలో కేసీఆర్ తుంగలో తొక్కాడు… ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తారని ఆశిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రానికి మోడీ ఎంతో చేశారని చెప్పదు కదా .. కాళేశ్వరం కు ఎన్ని అనుమతులు కేంద్రం ఇచ్చిందో… వేదిరే శ్రీరామ్ ఏమీ చెప్పారో నాకు తెలియదన్నారు.
Vyooham Movie Review : వ్యూహం మూవీ రివ్యూ