నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురిపై ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో జరిగిన దాడిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. దాడి జరిగిందని తెలియగానే స్వయంగా ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అమిత్ షాకు అర్వింద్ వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు.. పార్లమెంట్ లో అర్వింద్ ఎక్కడ తిరిగిన దాడులు జరుపాలని టీఆర్‌ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిదని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ అర్వింద్. ఇవాళ్టి దాడి వెనక ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారని అమిత్‌షాకు ఎంపీ అర్వింద్ వివరించారు.
Bimbisara Story : అసలెవరీ బింబిసారుడు.. చరిత్ర ఏం చెబుతోంది..!
అయితే.. వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ముంపుకు గురైన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి సందర్శించేందుకు నేడు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ బయలుదేరారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎంపీ అర్వింద్ ను అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో అరవింద్ కారుపై దాడి చేసారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా.. గతేడాది మల్లన్న గుట్ట భూమి విషయమై గ్రామ కుల సంఘాలు కలిసి ఎంపీనీ వేడుకున్న విషయం తెలిసిందే.. అయితే విషయాలను ధర్మపురి అర్వింద్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఎంపీ అర్వింద్ ను పోలీసులు అక్కడనుంచి ఆయనకు పంపించేసిన విషయం తెలిసిందే.