Amit shah Tour Cancel: బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యే అవకాశం ఉంది. బిపార్జోయ్ తుఫాన్ ఆయన పర్యటనను ప్రభావితం చూపనుంది. తుఫాన్‌పై ఉన్నత స్థాయి సమీక్షలు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు. అంతేకాకుండా తుఫాన్ సహాయక చర్యలతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్‌కు వెళ్లకుండా నేరుగా ఖమ్మం సభకు రావాలని రాష్ట్ర బీజేపీ నేతలు కోరుతున్నారు. అయితే దీనిపై హోంమంత్రి కార్యాలయం స్పందించాల్సి ఉంది.
Read also: Greece: గ్రీక్ తీరంలో ఓడ బోల్తా .. 17 మంది మృతి
ఇదిలా ఉంటే మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతలు, క్యాడర్ ను సిద్ధం చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 15న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అమిత్ షా నిర్ణయించారు.దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం అమిత్ షా రాత్రి 11.45 చేరుకోనున్నారు. 12.45 నుంచి శంషాబాద్ జేడీ కన్వెన్షన్ లో సీనియర్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం భద్రాచలంకు వెళ్లనున్నారు. ఉదయం 4 గంటల నుంచి 4.40 వరకు శ్రీరాముల వారిని దర్శించుకోనున్నారు.
అనంతరం అక్కడి నుండి ఖమ్మంకి వెళ్లనున్నారు అమిత్ షా. సాయంత్రం 5.40- 5.55 వరకు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 6-7 గంటల వరకు ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభలో పాల్గొననున్నట్లు బీజేపీ పార్టీ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే..ఇంతకు ముందు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అమిత్ షా పర్యటలో ఎవరెవరిని కలుస్తారో అనే అంశం ఆశక్తి రేపుతున్న సమయంలో టూర్ రద్దయ్యే అవకాశాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
Greece: గ్రీక్ తీరంలో ఓడ బోల్తా .. 17 మంది మృతి
