హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ రోడ్డుపైన అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా కత్తితో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అంతా చూస్తుండగానే దుండగులు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. పట్టపగలు ఇలాంటి సంఘటన జరగడం కలకలం రేపింది.
పేలిన సిలిండర్లు.. పరుగులు తీసిన స్థానికులు
హైదరాబాద్ లో మరో సంఘటన జరిగింది. హకీంపేట్ సాలార్ జంగ్ బ్రిడ్జి ఏరియాలో సిలిండర్లు పేలిపోయాయి. వెల్డింగ్ వర్క్ నడుస్తుంటే ఒక్కసారిగా 5 సిలిండర్లు పేలిపోవడం ఆందోళన కలిగించింది. భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు స్థానికులు. సంఘటన స్థలానికి చేరుకున్న మూడు ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పేశాయి. LPG సిలిండర్‌లను ఇక్కడ ఉపయోగించి వాటి నుంచి చిన్న సిలిండర్‌లకు గ్యాస్ నింపుతుంటారు. చిన్న సిలిండర్లు నింపే సమయంలో పేలుడు సంభవించింది. ఎవరికి ఎటువంటి గాయాలు సంభవించలేదు. ఇప్పటికే సికింద్రాబాద్ సమీపంలో డెక్కన్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
Kulsumpura incident: కుల్సుంపురాలో దారుణం. నడిరోడ్డుపై దుండగుల దాడి
