Site icon NTV Telugu

Umamaheswari Funerals: నేడు ఉమమహేశ్వరి అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో ఏర్పాట్లు

Umamaheswari Funerals

Umamaheswari Funerals

ఇవాళ కంఠమనేని ఉమా మహేశ్వరి అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. అయితే.. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఆమె భర్తతో కలిసి ఉంటున్నారు. ఆమె వచ్చేవరకు అంత్యక్రియలు ఆపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నేటి ఉదయం విశాల నగరానికి వచ్చేస్తారని ఆ తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

మాజీ సీఎం ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (57) సోమవారం బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఉమామహేశ్వరి అంత్యక్రియలను నేడు మహాప్రస్తానంలో నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. అయితే.. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఉన్నారని, విశాల కడసారి తన తల్లిని చూసుకునేందుకే అంత్యక్రియలను ఆపినట్లు తెలిపారు. ఆమె రాగానే అంత్యక్రియల ప్రక్రియను ప్రారంభించనున్నారు. అయితే.. ఉమా మహేశ్వరి పార్థీవ దేహానికి మంత్రులు తలసానిశ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు నివాళులు అర్పించారు. ఉమా మహేశ్వరి మృతిచందడం బాధాకరమని ఎన్టీఆర్​ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని మంత్రులు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ కు చిన్న కూతురు అంటే అత్యంత ఇష్టమని, దేవుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు.

ఉమా మహేశ్వరి పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా జూబ్లీహిల్స్​లోని ఆమె ఇంటికి తరలివస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, గారపాటి లోకేశ్వరి, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, కళ్యాణ్ రామ్, నారా భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.

Jagananna Thodu Scheme: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్.. ఇవాళే వారి ఖాతాల్లో సొమ్ము జమ..

Exit mobile version