యూకో బ్యాంక్ గత ఏడు, ఎనిమిది క్వార్టర్ ల నుండి గణనీయమైన ఫలితాలను సాధిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు యూకో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోమ శంకర ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంక్ క్యాపిటల్ సమర్థత ప్రస్తుతం అన్ని బ్యాంక్ ల కంటే ఉత్తమంగా ఉందన్నారు. కోవిడ్ మూలంగా ప్రజలందరూ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎంచుకున్నారన్నారు.
తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్ తో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఆన్లైన్ లోనే చాలా సులువుగా చేసుకోవచ్చన్నారు.బడ్జెట్ బ్యాంక్ లకు ఆశాజనకంగా ఉండడంతో వచ్చే సంవత్సరానికి యూకో బ్యాంక్ ఇంకా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.రానున్న కాలంలో దేశంలో మరిన్ని నగారాలలో యూకో బ్యాంక్ ను ఏర్పాటు చేయనున్నట్లు,డీ మ్యాట్ అకౌంట్ ద్వారా స్టాక్ వాడేవారికి తమ బ్యాంక్ యాప్ అధికంగా డిస్కౌంట్ ఇస్తుందన్నారు యూకో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోమ శంకర ప్రసాద్.
