Site icon NTV Telugu

Tragedy: మహబూబాబాద్‌ లో విషాదం.. లారీ బోల్తాపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి

Bahabubabad Accident

Bahabubabad Accident

Tragedy: మహబూబాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. గూడూరు మండల కేంద్రంలో కట్టెల లోడ్ తో వస్తున్న లారీ బోల్తా పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిని ఘటన కుటుంబంలో విషాదం నింపింది. మహబూబాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ గూడూరు మండల కేంద్రం దగ్గర ఉన్న మూలమలుపు దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. లారీ బోల్తా పడడంతో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడ మృతి చెందారు. అధిక లోడుతో ఉండడంతోనే మూలమలుపు దగ్గర అదుపుతప్పి లారీ బోల్తా పడ్డట్టు స్థానికులు చెప్తున్నారు. కట్టెలల్లోడు పూర్తిగా తొలగిస్తే కానీ మృతుల సంఖ్య తెలవదని స్థానికులు అంటున్నారు.

Read also: Viral Video : రెచ్చిపోయి టోల్ సిబ్బందిని కొట్టిన ఇన్‌స్పెక్టర్.. వీడియో వైరల్

లారీలో ఉన్న కట్టలను తొలగిస్తున్నారు స్థానికులు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రోడ్డు క్రాస్‌ చేస్తున్నప్పుడు డ్రైవర్‌ లారీని ఎక్కువగా క్రాస్‌ చేయడంతో లారీ ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనే వున్న మినీ లారీపై పడింది. మినీ లారీలో కూడా కొందరు ప్రయాణం చేసేవారు వున్నారని స్థానికులు వెళ్లడించారు. కాగా.. కట్టెల లోడ్‌ తో వున్న లారీలో డ్రైవర్‌ క్లీనర్‌ తోపాటు ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారిద్దరూ తండ్రి, కొడుకుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తుల్లో ఇకరు కాలేజీ బ్యాగ్ ఉండటంతో తను కాలేజీకి వెళుతూ లారీ ఎక్కాడా? లేక ఇతర కారణాలు వున్నాయా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీద్దరు ఎవరు అన్నది ఆరా తీస్తున్నారు.
Assembly Session: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అవుతున్న తెలంగాణ ప్రభుత్వం..(వీడియో)

Exit mobile version