భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన కూడలిలో ఈరోజు ఉదయం బూర్గంపాడు ఎస్సై జితేందర్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం నుంచి సారపాక వైపుకు మోటారు సైకిల్‌పై ఒక బ్యాగ్‌తో వస్తున్న ఇద్దరిని అనుమానంతో పోలీసులు విచారించారు. వారి పేర్లను హేమల గంగి, సవలం నగేష్ అని చెప్పడంతో వారి వద్ద ఉన్న బ్యాగ్ ను తనిఖీ చేయగా వారి వద్ద పేలుడు పదార్థాలు ఉండటంతో వారి ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారు నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పమేడ్ LOS సభ్యులని వెల్లడించారు. అంతేకాకుండా, నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ సీజీ పామేడు ఏరియా కమిటీ LOS ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. వారి వద్ద నుండి 30జెలిటిన్ స్టిక్స్, 24డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్ 2 బండిల్స్ మరియు నగదు రూ. 31,500, కన్ఫెషన్ కమ్ సీజర్ పంచనామా కింద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.