మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువులో ఇద్దరు డాక్టర్లు దూకి సుసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వైద్యులు ఎఫ్ జడ్ బైక్‌పై వచ్చి..శామీర్‌పేట్ చెరువలో దూకినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే… వారు చెరువులో దూకే ముందు వారి బైక్, బ్యాగులు, సెల్ ఫోన్లు చెరువు గట్టుపై వదిలేయడంతో వారిని స్థానికులు గుర్తించారు.
read more : చిక్కుల్లో యాంకర్ ప్రదీప్..!
వాటి ఆధారంగా వీరిని అల్వాల్ లోని ఓ హోమియోపతి ఆస్పత్రికి చెందిన డాక్టర్లుగా పోలీసులు సులభంగా గుర్తిం చారు. ఇద్దరు మృత దేహాల కోసం గజ ఈతగాళ్ల సహాయాన్ని తీసుకున్న పోలీసులు.. మృత దేహాలను బయటకు తీశారు. అయితే.. వారి ఆత్మహత్యకు అసలు కారణాలు తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
