Site icon NTV Telugu

కార్వీపై హైదరాబాద్ సీసీఎస్‌‌లో రెండు కేసులు నమోదు…

ప్రముఖ స్టాక్​ బ్రోకింగ్​ సంస్థ కార్వీపై హైదరాబాద్‌ సీసీఎస్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి. పలు ప్రైవేటు బ్యాంకుల నుండి రుణాలు తిరిగి చెల్లించలేదంటూ హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులకు ఫిర్యాదు అందింది. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న అప్పు వాయిదాలు చెల్లించడం లేదని బ్యాంకులు ఆరోపణ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రుణాలు తీసుకుని చెల్లించలేదంటూ హెచ్​డీఎఫ్​సీ, ఇండస్ ఇండ్ బ్యాంకులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షేర్లను తనఖా పెట్టి రెండు బ్యాంకుల్లో కలిపి రూ.460 కోట్ల పైగా రుణాలు తీసుకున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ… గత కొన్ని ఏళ్లుగా వాయిదాలు చెల్లించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది.

read also : పీసీసీ చీఫ్ పేరు ప్రకటిస్తే.. టీ కాంగ్రెస్‌లో ప్రకంపనలేనా?

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో రూ.329 కోట్లు, ఇండస్ ఇండ్​ బ్యాంకులో 137 కోట్లు బకాయి తీసుకుంది కార్వి.2019లో కార్వీ సంస్థపై ఫిర్యాదు రావడంతో… కార్వీ లావాదేవీలు పై విచారణ జరిపి నిషేధం విధించింది సెబీ. వినియోగదారులకు చెందిన షేర్లను కార్వీ సంస్థ సొంత అవసరాలకు వాడుకుంది. అయితే.. తాజాగా కార్వి సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో హైదరాబాద్‌ సీసీఎస్ లో రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు.

Exit mobile version