NTV Telugu Site icon

Boys Drowned in Water: ప్రాణాంతకంగా మారిన కోతుల బెడద.. దాడిలో ఇద్దరు మృతి

Boys Drowned In Water

Boys Drowned In Water

Boys Drowned in Water: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద ప్రాణాంతకంగా మారుతోంది. కోతుల దాడికి రెండు నిండు ప్రాణాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో.. వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లికి చెందిన 19 ఏళ్ల దీపక్, 14 ఏళ్ల రాజేష్, 12 ఏళ్ల అఖిలేష్, అభిలాష్, హన్మంతు దేవీ నవరాత్రుల సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం వద్ద పూజలో పాల్గొన్నారు. సోమవారం పుణ్యస్నానాలు ఆచరించేందుకు లింగం చెరువు వద్దకు వెళ్లారు.

Read also: Donald Trump: సీఎన్ఎన్‌పై ట్రంప్ పరువు నష్టం దావా.. అలా పిలిచినందుకే..

గట్టుపై నడుచుకుంటూ వెళుతుండగా కోతుల గుంపు వారిపైకి దూసుకొచ్చింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక భయపడి ఆబాలురు అందరూ చెరువులోకి దూకారు. ఈత కొడుతూ వచ్చిన దీపక్ స్వయంగా బయటకు వచ్చి అభిలాష్‌ను రక్షించాడు. మరోవైపు రాజేష్ తన తమ్ముడు హన్మంతున్ని ఒడ్డుకు చేర్చాడు. అనంతరం తమ స్నేహితుడు అఖిలేష్‌ను రక్షించేందుకు వెళ్లగా.. ఇద్దరూ నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు…మృతులు రాజేష్ డిచ్‌పల్లి గురుకులంలో ఏడో తరగతి, అఖిలేష్ మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. పండుగ వేళ చిన్నపిల్లలు మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ అధికారులు పట్టించుకుని కోతులను గ్రామం నుంచి తరిమికొట్టాలని, కోతుల వల్ల గ్రామంలో అలజడి నెలకొందని తెలిపారు. అధికారులు స్పందించి కోతులను గ్రామం నుంచి వెల్లగొట్టాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Adipuruash: ‘ఆదిపురుష్’‎లో ఆ సీన్లు తొలగించాల్సిందే.. ఎంపీ హోంమంత్రి