NTV Telugu Site icon

Moranchapally: మోరంచపల్లికి రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

Moram Charla

Moram Charla

Moranchapally: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి రెండు ఆర్మీ హెలికాప్టర్లను పంపింది. మోరంచవాగు నీటిలో మునిగిన మోరంచపల్లి గ్రామం. దీంతో ఈ గ్రామంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆర్మీ హెలికాప్టర్లను గ్రామానికి పంపాలని సీఎస్ శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆర్మీ అధికారులతో మాట్లాడారు. దీంతో రెండు ఆర్మీ హెలికాప్టర్లను పంపేందుకు ఆర్మీ అధికారులు అంగీకరించారు. దీంతో రెండు ఆర్మీ హెలికాప్టర్లు హైదరాబాద్ నుంచి మోరంచపల్లికి బయలుదేరాయి. మోరంచపల్లి సమీపంలో నదిలో చిక్కుకుపోయిన జేసీబీలోని ఆరుగురిని రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపనున్నారు.

Read also: Kishan Reddy: దేశంలో విద్యుత్ కొరత లేకుండా చేసిన ఘనత మోడీ దే..!

మరోవైపు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది మోరంచపల్లికి చేరుకుంటున్నారు. మోరంచపల్లి సమీపంలోని కుందూరుపల్లికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. బోట్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోరంచపల్లికి చేరుకుంటారు. బోట్ల సాయంతో వరద బాధితులను బయటకు తీసుకువస్తామన్నారు. మోరంచపల్లి గ్రామాన్ని వాగు పొంగడంతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గ్రామానికి చేరుకున్నారు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ఈ గ్రామంలో పరిస్థితిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పరిస్థితిపై అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలపై అధికారులతో ఫోన్‌లో చర్చించారు. రెస్క్యూ టీమ్‌లను గ్రామానికి పంపించాలని ఆదేశించారు.

Talangana Rains: హమ్మయ్య ఆ టైం వరకు వర్షం లేదట.. వాతావరణ శాఖ వెల్లడి