NTV Telugu Site icon

ACP Uma Maheswara Rao: ఉమామహేశ్వర్ ఏసీబీ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులతోనే బినామీ వ్యాపారాలు

Uma Maehswer Rao

Uma Maehswer Rao

ACP Uma Maheswara Rao: ఉమామహేశ్వర్ ఏసీబీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పలువురు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్లు ఎసిబి గుర్తించింది. సందీప్ అనే పేరుతో ఉమామహేశ్వరరావు పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు ల్యాప్ టాప్ అవినీతి చిట్టాతో వెలుగులోకి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నాం.. ఎవరి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు రావాలని.. వివరాలను ఉమామహేశ్వర్ లాప్ టాప్ లో పొందుపరిచినట్లు అధికారులు గుర్తించారు.

Read also: Rapido Driver: హైదరాబాద్‌ లో దారుణం.. బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం..

ప్రతినిత్యం తన వెంటే లాప్ టాప్ పెట్టుకొని తిరిగేవాడని వెల్లడించారు. లాప్ టాప్ లో దొరికిన వివరాల ఆధారంగా ఎసిబి విచారణ చేపట్టింది. సిసిఎస్ లో అంతా తానే నడిపించినట్లు గుర్తించారు. పలు కీలకే కేసుల సంబంధించిన విచారణ అధికారిగా ఉమామహేశ్వర్ ఉన్నట్లు గుర్తించారు. ఫిర్యాదు ఇచ్చిన వారికే బెదిరింపులకు పాల్పడి వసూల్లకు పాల్పడ్డాడని గుర్తించారు. ఉమామహేశ్వర్ చేసిన అక్రమాల పైన పూర్తి స్థాయిలో ఎసిబి దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్ ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉమామహేశ్వర్ ను నాంపల్లి కోర్టుకు ఏసీబీ అధికారులు తరలించారు.

Read also: KTR: మరోసారి మానవత్వం చాటుకున్న కేటీఆర్‌..

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఉమామహేశ్వర రావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. కాగా.. ఉమామహేశ్వరరావు అక్రమ భాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతుంది. న్యాయం కోసం వెళ్ళిన బాధితులకు చుక్కలు చూపించినట్లు దర్యాప్తులో తేలింది. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు అందాయని, తనపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్ వేటు పడిందన్నారు. అయినా ఉమామహేశ్వరరావు తీరు మార్చుకోలేదని పేర్కొన్నారు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు జేబులో వేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సీసీఎస్ లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలు జరిపారని అన్నారు.

Read also: Kishan Reddy: బోనస్ ఇచ్చి కొనడానికి మీకు బాధ ఏంటి.. కిషన్ రెడ్డి ఫైర్

ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక ఎన్నారై ను సైతం బెదిరించి డబ్బులు దండుకున్నట్లు వెల్లడించారు. ఉమా మహేశ్వర రావు బూతు పురాణం పై సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. తోటి సిబ్బంది నీ సైతం తిట్లతో అవహేళన చేసిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయన్నారు. తన దగ్గరికి వచ్చినప్రతి కేస్ లోను ఉమా మహేశ్వర రావు చేతివాటం చూపించాడని, అక్రమ ఆస్తుల కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చాయి. తన ఇంట్లో నగదు ఉంచకుండా, తన అత్త మామల ఇంట్లో డబ్బును ఉంచినట్లు సమాచారం. లావాదేవీలు మొత్తాన్ని ట్యాబ్ లో రాసుకున్నారని, బహిరంగ మార్కెట్ లో 50 కోట్ల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్టు ఏసిబి అధికారులు గుర్తించారు.

CM Revanth Reddy: తిరుమలలో కల్యాణ మండపం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం