NTV Telugu Site icon

SR Nagar Robbery: ఎస్‌ఆర్‌ నగర్‌ చోరీ కేసులో ట్విస్ట్‌.. ఆభరణాల దొంగ అతనే..

Sr Nagar Robbery

Sr Nagar Robbery

SR Nagar Robbery: మనవాళ్లే కదా అనుకుంటే నట్టేట ముంచేశారు. ఇన్ని రోజుల అనుమానం లేకుండా ఆమె వద్ద పనిచేస్తూ ఆమెను ఓకంట కనపెడుతూ వచ్చారు. ఎప్పుడు సమయం దొరుకుతుందా అంటూ వేచిచూసారు. చివరకు ఆ సమయం రాగానే నమ్మిన ఆమెను నట్టేట ముంచి అక్కడి నుంచి పరారయ్యారు. లక్షల్లో కాదు ఏకంగా కోట్లకే ఎసరు పెట్టారు. దీంతో ఆఓనర్‌ లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించింది. భాగ్యనగరంలో చోటుచేసుకోవడంతో పోలీసులకు సవాల్ గా మారింది.

Read also: Rajanna Temple: రాజన్న ఆలయానికి హెలికాప్టర్‌ సేవలు.. చెరువు ప్రాంతంలో దిగేందుకు..

హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ లో భారీచోరీ కేసులో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా ఏడు కోట్ల బంగారు ఆభరణాలు కేసులో కొత్తకోణం భయటకు వచ్చింది. మాదాపూర్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఉండే రాధిక జూలరీ వ్యాపారం చేస్తోంది. ఆమె హోల్ సేల్ గా నగలు కొని తన ఫ్రెండ్స్, బంధువులకు నగలు అమ్ముతుంటుంది. అయితే ఇదే తరహాలో అనూష అనే ఓ మహిళ 50లక్షల విలువైన నగలు రాధిక వద్ద ఆర్డర్ ఇచ్చింది. మధురానగర్ కు నగలను తీసుకురమ్మని రాధీకకు అనూష చెప్పింది. అయితే ఇక్కడే రాధిక గుడ్డిగా మనుషులను నమ్మినట్టైంది. అనూష ఉండే ప్రాంతానికి డ్రైవర్ శ్రీనివాస్, మరో అసిస్టెంట్ అక్షయ్ లతో జ్యువెలరీ డెలివరీకి రాధిక పంపించింది. అదే కారులో 6.5 కోట్ల రూపాయల విలువైన డైమండ్ ఆభరణాలు కూడా ఉన్నాయి. డెలివరీ కోసం మధురానగర్ లో లొకేషన్ చేరుకుంది. డ్రైవర్‌ అక్షయ్ కారు దిగగానే.. డ్రైవర్‌ సీటులో వచ్చిన శ్రీనివాస్‌ మాట మాటకలుపుతూనే ఓక్కక్షణంలో కారుతో ఉడాయించాడు. దీంతో..డ్రైవర్‌ వెంటనే రాధికకు కాల్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. రాధిక వెంటనే ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు సమచారం అందించింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నెంబర్, సీసీ ఫుటేజ్ ఆధారంగా శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు. నాలుగు టీమ్ లుగా ఏర్పడి శ్రీనివాస్ జాడ కోసం గాలిస్తున్నారు. డ్రైవర్‌ ను అదుపులో తీసుకు విచారిస్తున్నారు. ఇదంతా డ్రైవర్‌, అసిస్టెంట్‌ పనినా? లేక ఇంకా ఎవరైనా ఇందులో భాగమయ్యారా? అనే కోణంలో విచారిస్తున్నారు.
Maha Shivratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Show comments